మాట్లాడుతున్న నిరంజన్‌రెడ్డి
పైచేయి సాధనకే అరుణ డ్రామాలు
Published Sat, Sep 3 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి
వనపర్తిటౌన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అధిపత్య, వర్గపోరులో తనది పైచేయిగా సాధించాలనే తాపత్రయంలో భాగంగానే అరుణమ్మ దీక్షల పేరిట డ్రామాలు చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో సకల జనులు పోరులో ఉంటే సొంత ఎజెండాతో దొంగలా తప్పించుకు తిరిగారని శనివారం పట్టణంలో నిరంజ¯Œæరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు వ్యతిరేకంగా వెకిలి మాటలు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటులో భాగంగా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు గద్వాలపై ఎందుకు మాట్లాడలేదని అన్నారు. గద్వాల జిల్లాకు కనీసం 12మండలాల మద్దతు లేదని, అరుణమ్మ పాదయాత్ర చేస్తే అలంపూర్‌కు చెందిన సురవరంను ఎమ్మెల్యేగా చేసిన వనపర్తిలో ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. మంచి వ్యక్తిఅయిన ఎమ్మెల్యే సంపత్‌ను వెంటబెట్టుకొని పాటలు, ఫ్లెక్సీలు పెట్టుకుంటుందని, వెట్టి చేసే కాడా అందరూ కావాలనే అరుణమ్మ కీర్తి మాత్రం తనొక్కతే వీరవనిత పాటలు వేసుకోవడం దారుణమని, ఎమ్మెల్యే సంపత్‌కు గౌరవం ఇవ్వారా అని ప్రశ్నించారు. అరుణమ్మను నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. గద్వాల, అలంపూర్ ప్రజలు వనపర్తి జిల్లా కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గౌని బుచ్చారెడ్డి, లక్ష్మారెడ్డి, గట్టుయాదవ్, బి. లక్ష్మయ్య, సర్దార్‌ఖాన్, భీమ్‌రెడ్డి, రాజేశ్వరమ్మ, వాకిటి శ్రీధర్, సతీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement