
నైజీరియాలో పవన్ కిడ్నాప్ కథ సుఖాంతం
ఒంగోలు : నైజీరియాలో కిడ్నాప్ అయిన కందుకూరు వాసి కథ సుఖాంతమైయింది. వెంకట పవన్కుమార్ను శుక్రవారం రాత్రి కిడ్నాపర్లు వదిలేశారు. ఈ మేరకు నైజీరియా నుంచి సమాచారం అందిందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. పవన్కుమార్ క్షేమంగా ఉన్నట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నైజీరియాలో పామ్ ఆయిల్ ఉత్పత్తికి సంబంధించిన ఓ భారతీయ కంపెనీలో పవన్కుమార్ మేనేజర్గా పని చేస్తున్నారు. గత ఐదు రోజుల క్రితం పవన్ కుమార్ కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే.