వర్మివాష్‌తో పంటలకు మేలు | vermiwash good for crops | Sakshi
Sakshi News home page

వర్మివాష్‌తో పంటలకు మేలు

Published Sat, Jul 30 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

కోనాపూర్‌లో సేంద్రీయ ద్రావణాన్ని పరిశీలిస్తున్న దృశ్యం

కోనాపూర్‌లో సేంద్రీయ ద్రావణాన్ని పరిశీలిస్తున్న దృశ్యం

రామాయంపేట: సేంద్రీయ ద్రావణమైన వర్మీవాష్‌తో  పంటలకు మేలు చేకూరుతుందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి గణేశ్‌ పేర్కొన్నారు. మండలంలోని కోనాపూర్‌లో ఆదర్శ రైతు పోచమైన కిషన్‌ తయారు చేసిన ద్రావణాన్ని పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎకరాకు మూడు లీటర్ల చొప్పున ద్రావణాన్ని పిచకారీ చేస్తే శిలీంద్రాలను రూపుమాపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ద్రావణంతో భూమి కూడా సారవంతంగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని గణేశ్‌ సూచించారు. కార్యక్రమలో రైతు కిషన్‌, ఇతర రైతులు అశోక్‌, భీరయ్య పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement