విజయవాడలో నేరాలకు పాల్పడే బ్లేడ్ బ్యాచ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీసీపీ కాంతిరాణా టాటా తెలిపారు.
విజయవాడ: నగరంలో నేరాలకు పాల్పడే బ్లేడ్ బ్యాచ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీసీపీ కాంతిరాణా టాటా తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు చేస్తున్నామన్నారు. దీంతోపాటు శివారు ప్రాంతంల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామన్నారు.
వెస్ట్ జోన్ పరిధిలో రౌడీషీటర్లకు మంగళవారం డీసీసీ కాంతిరాణా టాటా కౌన్సెలింగ్ ఇచ్చారు. నగర పరిధిలోని 136 రౌడీషీటర్లకుగాను 80 మంది వరకు కౌన్సెలింగ్ కు హాజరయ్యారని ఆయన తెలిపారు. రౌడీషీటర్ల రికార్డులను అప్‌డేట్ చేస్తున్నామని, పాత రాజ రాజేశ్వరీపేట, సింగ్ నగర్ లలో అవుట్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.