వీసా, వర్క్ పర్మిట్ లేనివారికి సెల్ కనెక్షన్ కట్
సౌదీలో కొత్త నిబంధన తీసుకొచ్చిన ప్రభుత్వం
మోర్తాడ్: వీసా, వర్క్ పర్మిట్ లేకుండా ఉంటున్న వలసదారుల సెల్‌ఫోన్లలో రీచార్జి చేయడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధిం చింది. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ రీచార్జి చేయాలంటే వీసా, వర్క్ పర్మిట్ నంబర్లను సెల్‌నంబరుతో జత చేస్తేనే బ్యాలెన్స్ రీచార్జి అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను సౌదీలో రూపొందించారు. గతంలో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి సిమ్‌కార్డు తీసుకుంటే ఎప్పుడంటే అప్పుడు సెల్ రీచార్జి చేసుకునే వీలుండేది. సౌదీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో బిన్‌లాడెన్, సౌదీ ఓజర్ వంటి ప్రముఖ కంపెనీలతోపాటు ఇతర చిన్న కంపెనీలు మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. పాస్‌పోర్టులు, వీసా, వర్క్ పర్మిట్‌లను సైతం తమ అధీనంలోనే ఉంచుకున్నాయి. దీంతో కార్మికులకు ఆధారం లేకుండా పోయింది.
మొబైల్ కోసం ప్రాధేయపడుతున్నారు
సౌదీలో ఎంతో మంది తెలుగువారు ఇక్కడ ఉన్న లీగల్ కార్మికుల మొబైల్‌ఫోన్‌లను కొన్ని నిమిషాలు వాడుకోవడానికి ప్రాధేయపడుతున్నారు. అడిగినవారికి మొబైల్‌ఫోన్‌లు ఇచ్చి మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాం.
- పాలకుర్తి అజయ్‌గుప్తా, రిసార్ట్ మేనేజర్, సౌదీ(భీమ్‌గల్ వాసి)