ఆర్యవైశ్యులు ఆదర్శంగా నిలవాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆర్యవైశ్యులు ఐకమత్యంతో ఆదర్శంగా నిలవాలని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబికా రాజా పిలుపునిచ్చారు. సోమవారం ఆలపాటి అనసూయమ్మ రామచంద్రరావు ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ కులమత రహితంగా అన్నివర్గాల ప్రజలకూ సహకరించి, ఆదర్శంగా నిలవాలన్నారు. ఏలూరు కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటుడు చలపతిరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరి ట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంబికా సోదరులు అభినందనీయులన్నారు. కార్తీక వన సమారాధనకు సహకరించిన ప్రముఖులను, సినీనటుడు చలపతిరావును సత్కరించారు. కూర్మాల శ్రీరామచంద్రమూర్తి, దేసు నరసింహరావు, పైడేటి రఘు, చెన్నా వెంకట్రామయ్య, బీవీ కృష్ణారెడ్డి, బ్రహ్మానందం, చలువాది శివకృష్ణ, తుమ్మలపల్లి అయ్యప్ప పాల్గొన్నారు.