సభ..రభస
నెల్లూరు(సెంట్రల్) : నిరసనలు, నిలదీతలు, బాయ్‌కాట్‌లతో జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. జిల్లాలో జరుగుతున్న అధికశాతం సభల్లో అధికారులు, టీడీపీ నాయకులకు నిరసనసెగలు తగులుతున్నారుు. అబద్ధాలు చెప్పడానికి సభలెందకంటూ ఓ చోట.. గత జన్మభూమి సభలలో చెప్పిన వాగ్దానాలకే దిక్కులేదు, ఇప్పుడు చెప్పేవి ఇంకెప్పుడు చేస్తారంటూ మరో చోట.. ఇలా నిలదీతలు సర్వసాధారణమయ్యారుు. సోమవారం జరిగిన సభల్లో కూడా బాయ్‌కాట్‌లు చోటుచేసుకున్నాయి.
► వెంకటగిరి మండలంలోని పాళెంకోట గ్రామంలో సోమవారం గ్రామసభలు నిర్వహించేందుకు ఆ గ్రామానికి వస్తున్న అధికారులను పొలిమేరల్లోనే అడ్డుకున్నారు. దారిలో కంపను వేసి వాహనాలను రాకుండా అడ్డుకున్నారు. తమ గ్రామంలో కనీసపు స్థారుులో కూడా అభివృద్ధి పనులు చేయలేదని, ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
► మనుబోలు మండలం కట్టువపల్లిలో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తుండగా గ్రామస్తులు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు విడుదల చేసే వరకు జన్మభూమి సభలను జరగనివ్వమని రైతులు గ్రామసభను అడ్డుకున్నారు. చెరువును పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేయడంతో ఎంపీడీఓ హేమలత, ఇరిగేషన్ ఏఈ ఠాగూర్ చెరువును పరిశీలించారు.
► పొదలకూరు మండలం నావురుపల్లిలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు సభను బాయ్‌కాట్ చేశారు. కొంతకాలంగా మైనింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. మైనింగ్ సమస్యపై అధికారులకు వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరగాల్సి వచ్చింది.
► ఉదయగిరి మండలం గండిపాళెంలో జరిగిన జ న్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఏపీఓను ఉ పాధి పనులలో సమస్యలపై గ్రామస్తులు నిలదీశారు.
► నెల్లూరు రూరల్ పరిధిలోని వనంతోపు సెంటరులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కనీసం తాగు నీరు ఇవ్వని ప్రభుత్వం మీదని, ఎందుకు ఈ సభలు పెడుతున్నారని టీడీపీ నాయకులను స్థానిక ప్రజలు నిలదీశారు.
► వెంకటగిరి నియోజక వర్గంలో జరిగే జన్మభూమి సభలకు సంబందించిన అధికారిక తేదీలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మార్చేశారు. తనకు ఇష్టమొచ్చినట్లు చేస్తామని చెబుతూ నియోజక వర్గంలోని అధికారులందరిని ఒకే మండలానికి తీసుకుని వచ్చి అధికారిక తేదీలలో కాకుండా తను నిర్ణరుుంచిన తేదీలలో నిర్వహించడం గమనార్హం. ఎమ్మెల్యే తీరుతో అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.