అబద్ధపు హామీలతో మోసపోయాం | WARRANTIES false mosapoyam | Sakshi
Sakshi News home page

అబద్ధపు హామీలతో మోసపోయాం

Published Mon, Nov 7 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

WARRANTIES false mosapoyam

అట్లూరు : అధికారంలోకి రాకముందు అధికార దాహంతో మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబునాయుడు
ప్రజలను మోసం చేశాడని  వేమలూరు  ప్రజలు వాపోయారు. మండలంలోని వేమలూరులో సోమవారం 
నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్సార్‌
కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఎన్నికలకు బంగారు రుణాలతో పాటు డ్వాక్రా
రుణాలు చెల్లించవద్దు, నేను వస్తే మీరు తాకట్టుపెట్టిన బంగారు మీ ఇంటికి వచ్చేటట్లు చేయడంతో పాటు మీరు
తీసుకున్న డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారన్నారు. అలాగే పంట రుణాలు పూర్తిగా మాఫీ
చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి, ఇంటికో ఉద్యోగం ఇలా ఎన్నెన్నో మోసపూరిత హామీలు ఇచ్చి
చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి
అందూరి రామక్రిష్ణారెడ్డి, మండలాధ్యక్షురాలు పెరుగుసావిత్రి, ఎంపీటీసీ శ్యామలమ్మ, వేమలూరు సర్పంచు
ప్రభాకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల నాయకులు మల్లుసుబ్బారెడ్డి, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, బాలక్రిష్ణారెడ్డి,
తిరుపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement