వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ హెచ్చరించారు.
వర్గీకరణ ప్రక్రియలో జాప్యాన్ని సహించం
Published Sun, Jan 22 2017 11:46 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
- నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పరిశపోగు శ్రీనివాసరావు
- పార్లమెంట్‌లో బిల్లు పెట్టకపోతే తమిళుల తరహా ఉద్యమం
కర్నూలు సీక్యాంప్: వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ హెచ్చరించారు. ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 20 నుంచి 3వ విడత మాదిగల మేలుకొలుపు యాత్ర జరుగుతోందని, యాత్ర పూర్తయ్యేలోగా బిల్లు పెట్టాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయంలో జాప్యాన్ని సహించేది లేదని, 13జిల్లాల మాదిగలతో బీజేపీ కార్యాలయాలను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. జీఓ నెంబర్ 25 ప్రకారం సబ్ ప్లాన్ నిధులను మాదిగల సంక్షేమానికి ఖర్చు పెట్టాలన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే తమిళుల తరహా ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాచపూడి చంద్రశేఖర్, చిన్నమాదిగ, సూరి, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement