అనంతలో దారుణం... | wife murdered by husband in ananthapur district | Sakshi
Sakshi News home page

అనంతలో దారుణం...

Published Sun, May 8 2016 8:10 AM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM

wife murdered by husband in ananthapur district

ధర్మవరం: మద్యం సేవించేందుకు డబ్బులివ్వలేదన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అంతమొందించాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ప్రకాష్ అనే వ్యక్తి చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య లక్ష్మీదేవి (37), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు ధర్మవరం బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన ప్రకాష్ శనివారం రాత్రి తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవ పడ్డాడు.

ఆమె ఇవ్వకపోవడంతో రోకలిబండతో తలపై మోదగా తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో పిల్లలు ఇంటి మిద్దెపై పడుకోవడంతో ఆదివారం ఉదయం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. డీఎప్పీ, సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిపై కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement