
విద్యార్థులపై మహిళా లెక్చరర్ వీరంగం
తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాలలో ఓ మహిళా లెక్చరర్ వీరంగం సృష్టించారు. ఆమె తరచూ తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడతారని విద్యార్థులు ఆరోపించారు.
లెక్చరర్ తీరును నిరసిస్తూ విద్యార్థులు కాలేజీలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహిళా లెక్చరర్ విద్యార్థులను దూషిస్తూ వారిపై చేయి చేసుకున్నారు. లెక్చరర్పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.