‘గాంధీ’ సెల్లార్‌లో పాపను వదిలేసిన మహిళ | woman left baby in the " Gandhi ' cellar | Sakshi
Sakshi News home page

‘గాంధీ’ సెల్లార్‌లో పాపను వదిలేసిన మహిళ

Aug 7 2016 11:07 PM | Updated on Sep 4 2017 8:17 AM

‘గాంధీ’ సెల్లార్‌లో పాపను వదిలేసిన మహిళ

‘గాంధీ’ సెల్లార్‌లో పాపను వదిలేసిన మహిళ

ఏడాదిన్నర వయసుగల పాపను సెల్లార్‌లో వదిలి వెళ్లిన ఘటన ఆదివారం గాంధీ ఆసుపత్రిలో జరిగింది.

గాంధీ ఆస్పత్రి: ఏడాదిన్నర వయసుగల పాపను సెల్లార్‌లో వదిలి వెళ్లిన ఘటన ఆదివారం గాంధీ ఆసుపత్రిలో జరిగింది. ఆస్పత్రి అధికారులు, పోలీసుల కథనం ప్రకారం...  గాంధీ ఆస్పత్రిలో లిఫ్ట్‌ సూపర్‌వైజర్‌గా పని చేసే భరత్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు తన బైక్‌ను పార్కింగ్‌ చేసేందుకు సెల్లార్‌లోకి వెళ్లాడు. అక్కడ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల పాప సంబంధీకులెవరూ కనిపించకపోవడంతో ఆస్పత్రి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆర్‌ఎంఓ బబిత నేతృత్వంలో చిన్నారిని పీఐసీయూకు తరలించి వైద్యసేవలందించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఓ మహిళ ఈ చిన్నారిని ఎత్తుకొని ప్రధాన భవనంలోకి ప్రవేశించి మెట్లు మీదుగా సెల్లార్‌లోకి దిగినట్లు నమోదైంది. అయితే దృశ్యాల్లో స్పష్టత లేకపోవడంతో మహిళను గుర్తించలేకపోయారు. చిన్నారికి కాళ్లు, చేతులు వంకరగా ఉన్నాయి. పోలియో సోకిందనే కారణంతో చిన్నారిని ఇక్కడ వదిలేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పాపను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement