అనుమానమే పెనుభూతమై.. | Women Killed By Husband | Sakshi
Sakshi News home page

అనుమానమే పెనుభూతమై..

Published Sun, Oct 16 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

అనుమానమే పెనుభూతమై..

అనుమానమే పెనుభూతమై..

- భార్యను కడతేర్చిన భర్త
చింతకొమ్మదిన్నె : కడప నగర శివార్లలోని కొప్పర్తి సమీపంలో ఉన్న హరీంద్రనగర్‌లో ఆదివారం ఉదయం ఐదు నెలల గర్భిణిని ఆమె భర్త దారుణంగా హతమార్చాడు. అనుమానమే ఈ ఘటనకు ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే....గత నాలుగు సంవత్సరాల క్రితం పెండ్లిమర్రి మండలం దర్బారుపేటకు చెందిన అమీరున్‌ను హరీంద్రనగర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్లా వివాహమాడాడు. వీరికి మూడు సంవత్సరాల చిన్నారి సమీర ఉంది. ప్రస్తుతం అమీరున్‌ ఐదు నెలల గర్భిణి. గత కొద్ది నెలల నుంచి ఇరువురి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఏర్పడ్డాయి. అమీరున్‌పై భర్త అబ్దుల్లాకు అనుమానం మొదలైంది. ఆదివారం తెల్లవారుజామున 6.30–7.00 గంటల మధ్య అమీరున్‌ ఇంటి వద్ద వంట సామగ్రిని శుభ్రం చేస్తుండగా వెనుక వైపు నుంచి అబ్దుల్లా రోకలిబడెతో తలపై రెండు మార్లు మోదడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.  విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రూరల్‌ సీఐ వెంకట శివారెడ్డి, తహసీల్దార్‌ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ కుళ్లాయప్ప సంఘటనానికి చేరుకున్నారు. నిందితుడి గురించి గ్రామంలో విచారించారు.  గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం రిమ్స్‌ మార్చురీకి తరలించారు. నిందితుడు పరారీలో ఉండగా గాలింపులు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కుళ్లాయప్ప తెలియజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement