పొడవైన బీర
ఆ‘గట్టు’కుంటున్న సాగు
Published Fri, Sep 16 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
గట్లపై కూరగాయల పంట
లాభాలార్జిస్తున్న యువ రైతు
గొల్లపల్లి(బొబ్బిలి రూరల్): రెండెకరాల భూమిలో వరి పండుతోంది. ఆదాయం బాగానే వస్తోంది. దాంతో సంతప్తి చెందలేదా యువ రైతు. పొలం గట్టుపై పాదులు పెంచాడు. లాభాలు కళ్లజూస్తున్నాడు. వరికంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఆ యువకుడు గొల్లపల్లికి చెందిన పాలవలస చంటి. రెండెకరాల వరి పంట పొలం గట్టుపై బీర, చిక్కుడు, ఆనప పాదులు వేశాడు. వరి పంటపై ఆదాయం బాగానే వస్తున్నా.. కూరగాయల సాగుతో అధిక ఆదాయం వస్తున్నట్లు చంటి ఆనందంగా చెప్పాడు.
4.5 అడుగుల బీర.. రెండున్నర అడుగుల చిక్కుడు
పొలం గట్లపై 3 నుంచి 4.5 అడుగుల పొడవైన బీరకాయలు, రెండున్నర నుంచి మూడున్నర అడుగుల పొడవువైన చిక్కుడు కాయలు కాయడం విశేషం. ఈ సీజన్‌లో బీర, చిక్కుడు కాయల దిగుబడి, డిమాండ్‌ను బట్టి కిలో రూ.20 నుంచి రూ.40 ధర పలుకుతోంది. వారానికి దాదాపు రూ.2 నుంచి రూ.3వేల ఆదాయం వస్తోంది.
కష్టానికి ఫలితం దక్కింది – పాలవలస చంటి, గొల్లపల్లి
ఏటా కూరగాయలు సాగు చేస్తున్నా. ఈ ఏడాది బాగుంది. రామభద్రపురం ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఈ విత్తనాలు బాగా దిగుబడి ఇస్తున్నాయి. వీటి ఖర్చు చాలా తక్కువ. వీటికి ఎలాంటి ఎరువు వేయలేదు. రోజూ 3 నుంచి 5గంటల పాటు పడ్డ కష్టానికి మంచి ఫలితం వచ్చింది.
Advertisement
Advertisement