జ్వరంతో ఒకరు మృతి
Published Thu, Aug 4 2016 6:42 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
ఎలిగేడు: మండలంలోని ధూళికట్టకు చెందిన కొండ రాజయ్య(38) జ్వరంతో బుధవారం మృతిచెందాడు. రాజయ్యకు 5రోజుల కిందట జ్వరంరాగా ఆస్పత్రికిలో వైద్యపరీక్షలు చేయించుకుని మందులు వాడుతున్నాడు. బుధవారం పొలం దున్నుతుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్సకోసం 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గ్రామంలో మరికొంత మంది జ్వరాలతో బాధపడుతున్నారని అధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement