మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మానసిక రుగ్మతతో ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆతహత్య చేసుకున్న సంఘటన శనివారం జరిగిది. ఎస్సై రవిరాజు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆలకుంట రాకేష్(18) గత కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
Jul 23 2016 8:01 PM | Updated on Aug 1 2018 2:35 PM
వర్ధన్నపేట టౌన్ : మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మానసిక రుగ్మతతో ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆతహత్య చేసుకున్న సంఘటన శనివారం జరిగిది. ఎస్సై రవిరాజు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆలకుంట రాకేష్(18) గత కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
తన కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని ఉదయం తెలుపగా స్థానికంగా వైద్యుడికి చూపించి మందులు ఇప్పించారు. వారు వ్యవసాయ పనులకు వెళ్లగా శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని రాకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఎల్లస్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవిరాజు తెలిపారు.
Advertisement
Advertisement