అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య | younger suicides | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య

Mar 17 2017 11:53 PM | Updated on Aug 1 2018 2:10 PM

ఓబుళంపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న సోమశేఖర్‌రెడ్డి (23) జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : ఓబుళంపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న సోమశేఖర్‌రెడ్డి (23) జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. చిన్నవెంకటరెడ్డి, ఆదెమ్మ దంపతుల కుమారుడైన సోమశేఖర్‌రెడ్డి కొంతకాలంగా వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఎన్నిచోట్ల వైద్యం చేయించినా నయం కాలేదు. నొప్పి మరింత తీవ్రం అవుతుండటంతో విలవిలలాడేవాడు. శుక్రవారం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో సోమశేఖర్‌రెడ్డి చీరతో దూలానికి ఉరి వేసుకున్నాడు. ఇరుగుపొరుగు వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement