చనుగొండ్ల (గూడూరు): మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామంలో పెళ్లి ఇష్టం లేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ పగిడాల చిన్న సుంకన్న, వెంకటమ్మల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల కుమార్తెకు పెళ్లి చేశారు. అలాగే కుమారుడు రాముడు (22)కి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం పెళ్లి చూపులకు వెళ్లాలని కుటుంబీకులు నిశ్చయించుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ యువకుడు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి పొలం దగ్గరికి వెళ్లి మ«ద్యం సీసాలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి వచ్చిన కుమారుడు అనంతలోకాలకు వెళ్లి పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.