రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Published Mon, Aug 15 2016 10:51 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
పమిడిముక్కల:
మంటాడ–లంకపల్లి ప్రధాన రహదారిపై కపిలేశ్వరపురం పాపయ్య చెరువువద్ద సోమవారంరోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం మంటాడ వైపు నుంచి సైకిల్‌పై కపిలేశ్వరపురం వస్తున్న ఎం.శ్రీనివాసరావు(45)ను వెనక నుంచి ఆటో ఢీకొంది. శ్రీనివాసరావు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు శ్రీనివాసరావుది కపిలేశ్వరపురం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగశ్రీనివాస్ తెలిపారు.
Advertisement
Advertisement