కడుపునొప్పితో యువకుడి ఆత్మహత్య | youth suicide with heavy stomach pain | Sakshi
Sakshi News home page

కడుపునొప్పితో యువకుడి ఆత్మహత్య

Published Tue, Jul 26 2016 6:55 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కుడుపునొప్పి భరించలేక ఓ యువకుడు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చర్లగూడలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

షాబాద్: కుడుపునొప్పి భరించలేక ఓ యువకుడు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చర్లగూడలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కల మహేందర్‌(30) గత మూడు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఇటీవల నొప్పి తీవ్రమవడంతో సోమవారం రాత్రి అతడు గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేపింది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement