
21 నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో విడత రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది.
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో విడత రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. జులై 21 నుంచి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆయన రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతపురంలో ఆయన రెండు విడతల్లో రైతు కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే.