కాసేపట్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో జగన్ భేటీ | YS Jagan to meet mps today | Sakshi
Sakshi News home page

కాసేపట్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో జగన్ భేటీ

Published Sun, Nov 22 2015 10:50 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

కాసేపట్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో జగన్ భేటీ - Sakshi

కాసేపట్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో జగన్ భేటీ

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని వైఎస్ జగన్ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
వరద ప్రాంతాల్లో రేపటి నుంచి జగన్ పర్యటన
 
వైఎస్ జగన్‌ ఈ నెల 23వ తేదీ నుంచి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో బాధితులను జగన్ పరామర్శిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement