రాజన్నా..నినుమరువలేం | ysr birth anniversary in anantapur district | Sakshi
Sakshi News home page

రాజన్నా..నినుమరువలేం

Published Sat, Jul 8 2017 11:27 PM | Last Updated on Sat, Jul 7 2018 3:00 PM

రాజన్నా..నినుమరువలేం - Sakshi

రాజన్నా..నినుమరువలేం

ఘనంగా వైఎస్సార్‌ 68వ జయంతి
– జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు
అనంతపురం : సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఎన్నటికీ మరువలేమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. వైఎస్సార్‌ 68వ జయంతిని శనివారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య కేడర్‌ అంతా అమరావతిలో జరుగుతున్న ప్లీనరీకి వెళ్లగా..అందుబాటులో ఉన్న ద్వితీయ శ్రేణి, మండల, పట్టణాల నాయకులు, కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి. ఎర్రిస్వామిరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరులు వైఎస్‌ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు.

తర్వాత సుభాష్‌రోడ్డులోని  వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ ఆశయాల సాధనకోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లా నలుమూలలా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలన్నారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు మిద్దె కుళ్లాయప్ప, వలిపిరెడ్డి శివారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, యూపీ నాగిరెడ్డి, కుమ్మర ఓబులేసు, చంద్రమోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు హిమబిందు, గిరిజమ్మ, జానకి, పోతులయ్య పాల్గొన్నారు.


- వైఎస్సార్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఎస్కేయూలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. రాప్తాడు నియోజకర్గం రాప్తాడు, ఆత్మకూరు, కనగానపల్లి,చెన్నేకొత్తపల్లి మండలాల్లో వైఎస్‌ జయంతి వేడుకలు జరిగాయి. శింగనమల నియోజకవర్గం శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో వైఎస్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి కేక్‌ కట్‌ చేశారు. హిందూపురం పట్టణంలో మహిళా విభాగం పట్టణ కన్వీనర్‌ నాగమణి ఆధ్వర్యంలో వైఎస్‌ విగ్రహానికి గజమాల వేశారు. హిందూపురం రూరల్‌ మండల పార్టీ కన్వీనర్‌ బసిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లోనూ వైఎస్‌ జయంతి వేడుకలను జరుపుకున్నారు. గుంతకల్లు పట్టణంలోని పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి గాది లింగేశ్వరబాబు, సీనియర్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి, పట్టణ కమిటీ అధ్యక్షుడు సుంకప్ప ఆధ్వర్యంలో వైఎస్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

అనంతరం కేక్‌ కట్‌ చేశారు.  ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు,బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. రాయదుర్గం పట్టణంలో  బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌టీ సిద్ధప్ప ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్‌ విగ్రహం వరకు బైకు ర్యాలీ నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. అలాగే గుమ్మఘట్ట, కణేకల్‌ మండలాల్లో వేడుకలు జరిగాయి. తాడిపత్రి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్దపప్పూరుæ, పెద్దవడుగూరు మండలాల్లో వేడుకలు జరుపుకొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్సార్‌ విగ్రహానికి పట్టణ, మండల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు బెడ్లు పంపిణీ చేశారు. పెనుకొండ, ఉరవకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, మడకశిర నియోజకవర్గాల్లో వైఎస్‌ జయంతి వేడుకలను ఘనంగా జరురుకున్నారు.

వైఎస్‌ ఆశయసాధనకు కృషి
అనంతపురం అగ్రికల్చర్‌ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా శనివారం అనంతపురంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ లింగాల శివశంకరరెడ్డి నివాళులర్పించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటచౌదరితో కలిసి సహకార బ్యాంకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ ముందున్న వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. రాష్ట్రాభివృద్ధికి, అన్ని వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్‌ చేసిన సేవలను స్మరించుకున్నారు. మహానేత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement