తాడేపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘వైఎస్సార్ 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నాం, రక్తదానం, పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని క్యాడర్ కి పిలుపునిస్తున్నాం.పార్టీ క్యాడర్ అంతా జులై 8న వీటిని నిర్వహించాలని కోరుతున్నాం.
ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి. వైఎస్సార్ మీద భక్తి ఉన్న వారంతా జయంతి కార్యక్రమాలు చేయొచ్చు. ఆ మహనీయుడిని స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. ఆ మేరకు క్యాడర్ అంతా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. వైఎస్సార్ ఆశయాలు, విధానాలతోనే వైఎస్సార్‌సీపీ ఏర్పడింది. వైఎస్ఆర్ ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతున్నాం’ అని పేర్ని నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment