అనారోగ్యశ్రీగా ఏమార్చేశారు | ysrcp dharna for aarogyasri at collectrates | Sakshi
Sakshi News home page

అనారోగ్యశ్రీగా ఏమార్చేశారు

Published Sat, Dec 10 2016 12:11 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

అనారోగ్యశ్రీగా ఏమార్చేశారు - Sakshi

అనారోగ్యశ్రీగా ఏమార్చేశారు

ఆరోగ్యశ్రీ నిర్వీర్యంపై వైఎస్సార్‌ సీపీ ధర్నా  
కలెక్టరేట్‌ వద్ద కదం తొక్కిన పార్టీ శ్రేణులు
కాకినాడ : రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మో‌హన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు దాదాపు మూడుగంటలపాటు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసం రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్‌ వైద్యసేవ పేరుతో పేరు మార్చడంతోపాటు అనేక జబ్బులను తొలగించి టీడీపీ సర్కార్‌ పేదలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ పేదోళ్ల కష్టాలు గుర్తించే హృదయం, తపన, అభిలాష లేని వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండడం వల్లే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారిపోయిందన్నారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ విషయంలో టీడీపీ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి  అమలు చేసిన పథకాలు తిరిగి యధావిధిగా అమలు జరగాలంటే జగన్మో‌హన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. 
కాంట్రాక్టర్లకు మేలుచేయడమే తెలుసు
అనపర్తి, రాజమండ్రిరూరల్, రంపచోడవరం, మండపేట నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, అనంత ఉదయభాస్కర్, వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ కోట్ల రూపాయల భూములను కారుచౌకగా కట్టబెట్డడం, కాంట్రాక్టర్లకు మేలు చేయడం తప్ప పేద ప్రజల ఆరోగ్యంతో ముడిపడే ఆరోగ్యశ్రీ పథకంపై  ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధ లేదని ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి దగ్గరలోనే ఉందన్నారు. కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్‌ మాట్లాడుతూ మహానేత వైఎస్‌ మరణానంతరం పేద ప్రజలు ఎంతో క్షోభ అనుభవిస్తున్నారన్నారు. 108 ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ కనీసం తాళాలు కూడా బాగు చేయించుకోలేని స్థితిలో 108 వాహనాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యమిత్ర కార్యకర్తల సంఘ అధ్యక్షుడు వీరభద్రరావు మాట్లాడుతూ నిర్వీర్యమైపోతున్న ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిరావూరి వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వట్టికూటి రాజశేఖర్, మిండగుదిటి మోహన్, రావు చిన్నారావు, కర్రి నారాయణరావు, బొబ్బిలి గోవిందు, లింగం రవి, ముదునూరి మురళీకృష్ణంరాజు, ఆవాల లక్ష్మినారాయణ, మోతుకూరి వెంకటేష్, అడ్డగళ్ళ సాయిరామ్, సంయుక్త కార్యదర్శులు  మురళీరాజు, బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శులు అల్లి రాజబాబు, దాసరి శేషగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా సుజాత, వైద్య, బీసీ,రైతు, విద్యార్థి, ప్రచార, ఎస్సీ, విభాగాల అధ్యక్షులు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ గీత, మట్టపర్తి మురళి, జున్నూరు వెంకటేశ్వరరావు, జక్కంపూడి కిరణ్, సిరిపురపు శ్రీనివాసరావు, పెట్టా శ్రీనివాస్‌ రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు.
పేర్లు మార్చడంపైనే శ్రద్ధ
మాజీ మంత్రి ముత్తా
మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ అమలు చేయడంలో కొరవడిందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు దేశంలోనే గొప్ప పథకంగా ఎంతో ప్రాచుర్యం పొందిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తుంటే ఎంతో బాధకలుగుతోందని, ప్రభుత్వాన్ని మేలుకొల్పేలా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అమలాపురం పార్లమెంట్‌ కో–ఆర్డినేటర్‌ వలవల బాబ్జి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ విధానంలో మార్పు రాకపోతే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాజోలు,  పి.గన్నవరం, ముమ్మిడివరం కో–ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ మాట్లాడుతూ రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి తొలుత పేరు మార్చి, ఆ తరువాత కొన్ని జబ్బులను తొలగించిన చంద్రబాబు మలివిడతలో మొత్తం పథకాన్ని రద్దు చేసే ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు. కాకినాడసిటీ, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట కో–ఆర్డినేటర్లు ముత్తా శశిధర్, తోట సుబ్బారావునాయుడు, పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వైద్యసేవగా పేరుమార్చి పథకాన్ని నిర్వీర్యం చేయడం వెనుక టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావును అభాసుపాలు చేయాలన్నదే చంద్రబాబు అంతిమలక్ష్యంగా కనిపిస్తోందన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement