హైదరాబాద్: వైఎస్సార్‌సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను శానససభలోకి అనుమతించకపోవడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు శనివారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు నిర్వహించి రాజ్యాంగనిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
టీడీపీ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరుచేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని పార్టీ నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి అనే నినాదాలతో అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ సర్కార్ గద్దె దిగాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన
Published Sat, Mar 19 2016 11:21 AM | Last Updated on Tue, May 29 2018 3:35 PM
Advertisement