తిరుపతి : తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ఆదివారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. టీడీపీకి గడ్డు రోజులు ప్రారంభమయ్యాయని వారు పేర్కొన్నారు. టీడీపీ పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి డిపాజిట్లు గల్లంతు అవుతుందన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందుకే మహానేత వైఎస్ఆర్ విగ్రహాలను పథకం ప్రకారం తొలగిస్తున్నారని చెప్పారు. ప్రజల్లో తమ పార్టీ పట్ల రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. తాము ఇటీవల చేపట్టిన గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా వెళ్లిన ప్రతి చోట చంద్రబాబుపై ప్రజలు మండిపడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు.