పార్టీ బలోపేతానికి చర్యలు
-
వైఎస్సార్సీపీ జిల్లా సమీక్షా సమావేశం
-
ప్రజా సమస్యలపై ఉద్యమించాలని అధిష్టానం సూచన
మంకమ్మతోట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ప్రజలకు దగ్గరయ్యేందుకు జిల్లాశాఖ ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చింది. ఈమేరకు హైదరాబాద్‌లోని పార్టీకేంద్ర కార్యాలయంలో జిల్లా నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్‌తోపాటు వందమంది పార్టీ ముఖ్యనాయకులు హాజరయ్యారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. వచ్చే నెల 10 లోపు గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. నేదునూర్ గ్యాస్ ఆధారిత పవర్‌ప్లాంట్‌ను వెంటనే చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజల నుంచి తీసుకున్న భూములు వారికి ఇవ్వాలన్నారు. భూములు స్వాధీనం చేసుకున్నా పనికి రాకుండా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌తో ఉద్యమాలు చేపట్టాలని పేర్కొన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ మండలం లెదర్‌పార్కును ఏర్పాటుచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. రైతులు, యువకులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి కార్యక్రమాలు రూపొందించుకోవాలని అధినాయకత్వం జిల్లా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఈ సందర్బంగా జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ సానా రాజయ్యతోపాటు 50మంది అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సమావేశానికి హాజరైన వారిలో రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె. నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర సీనియర్ నాయకుడు బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గాలి ప్రశాంత్‌బాబు, వరాల శ్రీనివాస్, ఎల్లంకి రమేష్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గండిశ్యామ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ధీటి సుధాకర్‌రావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు దేవరనేణి వేణుమాధవ్‌రావు, నాయకులు వినుకొండ రామకష్ణరెడ్డి, చొక్కాల రాము, సండ్రు విజయ్‌కుమార్, సందమల్ల నరేష్, సిరిరవి, మంద రాజేష్, రేషవేణి వేణుయాదవ్, ముస్తాక్ అహ్మద్, వాజిద్, పారుపెల్లి వేణుగోపాల్‌రెడ్డి,సాధిక్‌బలాల, విష్ణుకాంత్, ముల్కల గోవర్ధనశాస్త్రి, రవికాంత్, ఎడ్ల సురేందర్‌రెడ్డి, చారి, తిప్పల మల్లేషం, పాలకుర్తి రమేష్, గుండెటి శేఖర్, మారుపాక రాజేషం, సంపత్, మోత్కూరి శ్రీనివాస్ ఉన్నారు.