ప్రాణం పోయినా టీడీపీలో చేరను: ప్రతాప్ అప్పారావు
విజయవాడ: ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీలో చేరనని కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ తన కుమారుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశాడన్న వార్తలు అవాస్తవమన్నారు. దమ్ముంటే నిరూపించాలని మేకా అప్పారావు సవాల్ విసిరారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎప్పుడూ తప్పులు చేయలేదని, ప్రభుత్వానికి తాను భయపడేది లేదని ఎమ్మెల్యే అన్నారు.