పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలి | ZP CEO jitendarreddi about welfare schemes | Sakshi
Sakshi News home page

పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలి

Published Sat, Nov 26 2016 3:25 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలి

పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలి

జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి
తలమడుగు : అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భీంపూర్ మండలం తాంసి కే గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు స్థానికంగా ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అలాగే తలమడుగు మండలం బరంపూర్, తాంసి మండలం గిరిగామ్ గ్రామాల్లోనూ అ ధికారులు గ్రామదర్శిని నిర్వహించారు. అంగన్‌వాడీకేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. రేషన్ సరుకుల పంపిణీ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. తహసీల్దార్‌లు రాజేశ్వర్, రాంరెడ్డి, చిత్రు, ఎంపీడీవోలు భూమయ్య, సునీత, మండల ప్రత్యేక అధికారులు రాజేశ్వర్‌రాథోడ్, ఉమాదేవి, ఎంపీపీ మంజుల, రాము, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పుష్కర అవార్డుల ప్రదానం
తలమడుగు మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థులకు జెడ్పీ హాల్‌లో కోరమాండల్ ప్రతిభ పుష్కర అవార్డును జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపాల్ చైర్‌పర్సన్ మనీషా అందజేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా తలమడుగు మండలకేంద్రంలోని జెడ్పీ పాఠశాల విద్యార్థులకు రెండో స్థానం దక్కింది. దీంతో రూ.3500 నగదు అందజేశారు. ఉపాధ్యాయుడు రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement