
గ్రహం అనుగ్రహం, అక్టోబర్ 3, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం,
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం, తిథి బ.షష్ఠి రా.8.44 వరకు
నక్షత్రం రోహిణి ప.1.35 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం ఉ.5.50 నుంచి 7.24 వరకు
తిరిగి రా.7.05 నుంచి 8.40వరకు
దుర్ముహూర్తం ఉ.5.54 నుంచి 7.28 వరకు
అమృతఘడియలు ఉ.10.29 నుంచి 12.01 వరకు
భవిష్యం
మేషం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవచింతన.
కర్కాటకం: వ్యవహారాలలో ముందడుగు. ఆస్తిలాభం. దూరపు బంధువులను కలుసుకుంటారు. చర్చలు సఫలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
సింహం: దూరపు బంధువుల కలయిక. భూ, వాహనయోగాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కన్య: బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
ధనుస్సు: నూతన పరిచయాలు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి.
మకరం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.
మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటాయి.
- సింహంభట్ల సుబ్బారావు