కష్టపడి చదివితే సివిల్స్‌లో విజయం
నరసాపురం : లక్ష్యంతో కష్టపడి చదువుతూ ముందుకెళితే సివిల్స్‌లో విజయం సాధించవచ్చని 2015 ఐఏఎస్ టాపర్ వి.విద్యాసాగర్‌నాయుడు సూచించారు.
నరసాపురం : లక్ష్యంతో కష్టపడి చదువుతూ ముందుకెళితే సివిల్స్‌లో విజయం సాధించవచ్చని 2015 ఐఏఎస్ టాపర్ వి.విద్యాసాగర్‌నాయుడు సూచించారు. బుధవారం స్థానిక వైఎన్ కళాశాల ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు సివిల్స్‌లో మెళకువలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసాగర్ నాయుడుతో పాటు, ఐఆర్‌ఎస్ టాపర్(హైదరాబాద్) దిండ్ల దినేష్ కూడా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సివిల్స్ పరీక్షలకు ఎలా తర్ఫీదు పొందాలి అనే విషయాలను వివరించారు. విద్యార్థుల ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళితే ఐఏఎస్, ఐపీఎస్‌లు సాధించవచ్చని సూచించారు. వైఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, పీజీ కోర్సుల డైరెక్టర్ డాక్టర్ ఎన్.చింతారావు, డాక్టర్ చినమిల్లి శ్రీనివాస్, టేలర్ హైస్కూల్ కరస్పాండెంట్ పి.జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు