in nsp
-
పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం
నరసాపురం రూరల్ : మండలంలోని స్వర్ణాంధ్ర విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం 21వ అంతర పాలిటెక్నికల్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభం అయ్యా యి. తొలుత ఈ పోటీలను ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మున్సిపల్ చైర్ పర్స న్ రత్నమాల క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంబించారు. కాకినాడకు చెందిన టెక్నికల్ ఎడ్యుకేషన్ రీజనల్ డైరెక్టర్ జె. సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ డిపార్డ్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ రీజనల్ డైరెక్టర్ కాకినాడ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అడబాల అయ్యప్పనాయుడు, ప్రిన్సిపాళ్లు శ్రీనివాసకుమార్, తెన్నేటి మధు, పోలిటెక్నికల్ కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, వ్యాయామోపాధ్యాయులు, కే ఎస్వీస్ఎస్ మూర్తి, వి.జయచంద్ర, పి.నరసింహరాజు, కుమార్రాజు, నర్సింహరావు, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తుందుర్రు నుంచి తరలించాలి
నరసాపురం : తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తుందుర్రు నుంచి తరలించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ డిమాండ్ చేశారు. తుందుర్రు రొయ్యల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అంబేడ్కర్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 44వ రోజుకు చేరాయి. బుధవారం దీక్షల్లో బలరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 గ్రామాల ప్రజలు నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 1972లో జలకాలుష్య నిర్మూలనపై చట్టం చేసినా, నేటి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీక్షా శిబిరాన్ని సర్వోదయ రైతు సంఘం నాయకుడు డాక్టర్ శిరిగినీడి నాగభూషణం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన పోరాడాలని కోరారు. దీక్షల్లో ఎం.త్రిమూర్తులు, యడ్ల చిట్టిబాబు, పొగాకు నారాయణరావు, కాకిలేటి ప్రసాద్, తెలగంశెట్టి సత్యనారాయణ కూర్చున్నారు. సీపీఎం పాదయాత్ర వాయిదా ఏలూరు(సెంట్రల్): గొంతేరు, యనమదుర్రు, గోస్తనీ, కొల్లేరు జీవనదులు, భూగర్భ జలాల కాలుష్యంపై నిర్వహించనున్న ప్రజాభేరి పాదయాత్ర వాయిదా వేసినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేసినట్టు చెప్పారు. తిరిగి పాదయాత్ర ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
2020 నాటికి కోటిపల్లి రైల్వేలైన్‌కు ఓ రూపు
నరసాపురం : కోటిపల్లినరసాపురం రైల్వేలైన్‌కు 2020 నాటికి ప్రాథమికంగా ఓ రూపు వస్తుందని దక్షణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. శుక్రవారం నరసాపురం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటిపల్లి రైల్వేలైన్‌కు సంబంధించి మూడు బ్రిడ్జిల నిర్మాణం ముందుగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. గౌతమి నదిపై రైల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వైనతేయి, వశిష్ట నదులపై రైలు వంతెనల నిర్మాణాలపై ఎలాంటి కదలిక లేదన్నారు. ఈ మూడు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తవ్వడానికే 30, 40 నెలలు పడుతుందని పేర్కొన్నారు. నరసాపురం రైల్ కం బ్రిడ్జి లేదు నరసాపురంలో రైల్ కం వంతెన నిర్మాణ ప్రతిపాదనలు లేవన్నారు. కోటిపల్లి రైల్వేలైన్‌కు సంబంధించి నరసాపురంలో రైల్ కమ్ బ్రిడ్జి లింక్ ఉండదన్నారు. చించినాడ బ్రిడ్జి వద్దే సమాంతరంగా రైల్ బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా రైల్కమ్బ్రిడ్జిల ప్రతిపాదనలు లేవని చెప్పారు. అలాగే ఆర్వోబీల నిర్మాణాల ప్రతిపాదనలు కూడా లేవన్నారు. ఆయన వెంటన రైల్వే డీజీఎం (విజయవాడ) అశోక్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
ఉద్యమంపై ఉక్కుపాదం
రెండిళ్లకు ఒక పోలీస్ చొప్పున పహారా. రైతు పొలానికి వెళ్లాలన్నా.. మహిళలు పచారీ సామగ్రి తెచ్చుకోవాలన్నా.. పోలీసుల అనుమతి తప్పనిసరి. భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, నరసాపురం మండలం కె.బేతపూడి గ్రామాల్లో అప్రకటిత కర్ఫూ్య నెలకొంది. అక్కడి పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. పోలీస్ పహారా నడుమ ఆ మూడు గ్రామాల మధ్య గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణ పనులను చకచకా సాగిస్తున్నారు. 30 గ్రామాలను కాలుష్య కాసారంగా మార్చే ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని అన్నివర్గాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు 600 మంది పోలీసులను వారిపై ప్రయోగించింది. ఫుడ్ పార్క్‌కు యంత్రసామగ్రి తరలింపు భీమవరం అర్బన్/నరసాపురం రూరల్ : పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆపాలంటూ 40 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం చకచకగా పూర్తి చేసుకుంటోంది. నిర్మాణంలో భాగంగా భారీ భద్రత నడుమ సోమవారం యంత్రాలను ఫ్యాక్టరీకి తరలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య రొయ్యల ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదుతో ఆందోళనకారుల అరెస్ట్ చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, మత్స్యకారులు నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఫ్యాక్టరీకి దాదాపు 100 లారీల్లో యంత్ర, నిర్మాణ సామగ్రి వచ్చింది. ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం ఉదయమే ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఒక ఏఎస్పీ, నలుగులు డీఎస్పీలు, 22 మంది సీఐల సహా దాదాపు 600 మంది పోలీస్ బలగాలను మోహరించారు. ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఇతర ప్రాంతాలను ఆయా గ్రామాల్లోకి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు మధ్య ముడిసరుకును తరలిస్తున్న లారీలను ఎస్కార్ట్‌తో ఫ్యాక్టరీ లోపలికి పంపించారు. సర్వత్రా నిరసనలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో నిర్మించే గోదావరి మెగా ఫుడ్ పార్కు నిర్మించవద్దని రెండేళ్లుగా ఈ ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఫుడ్ పార్కు నిర్మాణ యజమానులకు అధికారులు, ప్రజాప్రతినిధులు కొమ్ముకాయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. చిన్న చిన్న కేసులకు పోలీసులు బాధితులను కాళ్లరిగేలా తిప్పించుకుంటారు. సమస్యలను కూడా వినరు. కానీ బడాబాబులకు చెందిన ఫ్యాక్టరీ నిర్మాణానికి యంత్రాలను పంపించేందుకు 600 మంది పోలీసులను మోహరించడంపై స్థానికులు నివ్వెరపోయారు. నిర్మాణ, యంత్ర సామగ్రిని తరలించేందుకు ముందుగానే పోరాట కమిటీ నాయకులను, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుడ్పార్కుపై సీపీఎం, సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తదితరులు ఫుడ్ పార్కును నిలుపుదలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం. -
ప్యాకేజీలతో ప్రయోజనం లేదు
నరసాపురం: స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర భవిష్యత్‌ను ఢిల్లీ పెద్దల పాదాల ముందు తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్యాకేజీల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ ఉండదని, ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీలకు తలొగ్గడం తగదన్నారు. సాధారణంగా కేంద్రం వెనుకబడిన రాష్ట్రాలకు కొద్దిమేర నిధులు కేటాయిస్తుందని ఈ క్రమంలో మన రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే అదే బ్రహ్మాండమనే రీతిలో టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడే.. చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడే, కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారని ప్రసాదరాజు విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు భారీ రాయితీలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉఫాది అవకాశాలు పెరుగుతాయన్నారు. హోదా కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేయడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గడపగడపకూ కార్యక్రమంలో చంద్రబాబు దమననీతిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. -
కష్టపడి చదివితే సివిల్స్‌లో విజయం
నరసాపురం : లక్ష్యంతో కష్టపడి చదువుతూ ముందుకెళితే సివిల్స్‌లో విజయం సాధించవచ్చని 2015 ఐఏఎస్ టాపర్ వి.విద్యాసాగర్‌నాయుడు సూచించారు. బుధవారం స్థానిక వైఎన్ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు సివిల్స్‌లో మెళకువలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసాగర్ నాయుడుతో పాటు, ఐఆర్ఎస్ టాపర్(హైదరాబాద్) దిండ్ల దినేష్ కూడా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సివిల్స్ పరీక్షలకు ఎలా తర్ఫీదు పొందాలి అనే విషయాలను వివరించారు. విద్యార్థుల ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళితే ఐఏఎస్, ఐపీఎస్‌లు సాధించవచ్చని సూచించారు. వైఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, పీజీ కోర్సుల డైరెక్టర్ డాక్టర్ ఎన్.చింతారావు, డాక్టర్ చినమిల్లి శ్రీనివాస్, టేలర్ హైస్కూల్ కరస్పాండెంట్ పి.జగన్మోహన్రావు పాల్గొన్నారు -
కష్టపడి చదివితే సివిల్స్‌లో విజయం
నరసాపురం : లక్ష్యంతో కష్టపడి చదువుతూ ముందుకెళితే సివిల్స్‌లో విజయం సాధించవచ్చని 2015 ఐఏఎస్ టాపర్ వి.విద్యాసాగర్‌నాయుడు సూచించారు. బుధవారం స్థానిక వైఎన్ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు సివిల్స్‌లో మెళకువలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసాగర్ నాయుడుతో పాటు, ఐఆర్ఎస్ టాపర్(హైదరాబాద్) దిండ్ల దినేష్ కూడా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సివిల్స్ పరీక్షలకు ఎలా తర్ఫీదు పొందాలి అనే విషయాలను వివరించారు. విద్యార్థుల ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళితే ఐఏఎస్, ఐపీఎస్‌లు సాధించవచ్చని సూచించారు. వైఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, పీజీ కోర్సుల డైరెక్టర్ డాక్టర్ ఎన్.చింతారావు, డాక్టర్ చినమిల్లి శ్రీనివాస్, టేలర్ హైస్కూల్ కరస్పాండెంట్ పి.జగన్మోహన్రావు పాల్గొన్నారు -
అంత్య పుష్కరాలు విజయవంతం
నరసాపురం : గోదావరి అంత్య పుష్కరాలు కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. నరసాపురంలో గురువారం సాయంత్రం జరిగిన అంత్య పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైఎన్ కళాశాల నుంచి యాత్ర నిర్వహించిన అనంతరం, వలంధర్‌రేవు వద్ద గోదావరి మాతకు మంత్రి పూజలు చేశారు. అనంతరం గోదావరి మాతకు అఖండ హారతి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అంత్య పుష్కరాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల, ఏఎంసీ చైర్మన్ రాయుడు శ్రీరాములు, డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.