ఆయుష్ కౌన్సెలింగ్ 2014 | Ayush counseling 2014 | Sakshi
Sakshi News home page

ఆయుష్ కౌన్సెలింగ్ 2014

Published Thu, Nov 6 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

ఆయుష్ కౌన్సెలింగ్ 2014

ఆయుష్ కౌన్సెలింగ్ 2014

కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఆయుష్ కౌన్సెలింగ్‌కు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ విధివిధానాలు..

బీఏఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), బీహెచ్‌ఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), బీఎన్‌వైఎస్ (బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఆయుష్ కౌన్సెలింగ్‌కు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ విధివిధానాలు..
 
బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సుల్లో ప్రవేశానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నవంబర్ 7,8 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ వివరాలు..
అర్హత:
గ్రూప్ సబ్జెక్ట్‌లలో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/తత్సమానం (బైపీసీ). ఎంసెట్-2014లో అర్హత సాధించి ఉండాలి.
 వయసు: 17 ఏళ్లు (డిసెంబర్ 31, 2014 నాటికి)
 
 కావలసిన సర్టిఫికెట్లు:
 ఎంసెట్-2014 హాల్‌టికెట్, ర్యాంకు కార్డు
 
 జనన ధ్రువీకరణ పత్రం (ఎస్‌ఎస్సీ/తత్సమాన)
 
 ఇంటర్మీడియెట్/తత్సమాన మార్కుల జాబితా;
 
 టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్);
 
 ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
 
 ఇతర రాష్ట్రాల్లో చదివి ఉంటే... తహసీల్దార్/ఎంఆర్‌ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్
 
 రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఎంఆర్‌ఓ/తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్),ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు ఎంఆర్‌ఓ/తహసీల్దార్ 1-1-2014 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్.
 
 తొలుత అన్ రిజర్వ్‌డ్:

 కౌన్సెలింగ్‌లో మొదట 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ సీట్లు, తర్వాత 85 శాతం లోకల్ సీట్లు భర్తీ చేస్తారు. 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కోటా సీట్ల కోసం.. తమ రీజియన్‌తో సంబంధం లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడొచ్చు. రిజర్వేషన్, లోకల్ ఏరియా కేటగిరీలతో నిమిత్తం లేకుండా ముందుగా ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుందో? లేదో? పరిశీలిస్తారు. మెరిట్ ఉంటే లోకల్‌తో సంబంధం లేకుండా ఎక్కడైనా అన్ రిజర్వ్‌డ్ కింద సీటు లభిస్తుంది. లేకపోతే వర్సిటీ ఏరియా, రిజర్వేషన్, లోకల్, నాన్ లోకల్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మెరిట్ అభ్యర్థి నాన్‌లోకల్ ఏరియాలో ఎక్కడైనా సీటు పొందొచ్చు.
 
 కౌన్సెలింగ్ ఫీజు:

 ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఫీజు రూ. 500; ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ.300.
 
 ఫీజుల వివరాలు:
 ప్రభుత్వ కళాశాలల్లో యూనివర్సిటీ (కౌన్సెలింగ్ సెంటర్‌లో చెల్లించాలి) ఫీజు రూ.5,000. ప్రైవేటు ఏ-కేటగిరీ సీటుకు రూ. 7,000, బీ-కేటగిరీ సీటుకు రూ. 9,000.
 ట్యూషన్ ఫీజు (కళాశాలలో చెల్లించాలి): ప్రభుత్వ కళాశాలలో పూర్తి కోర్సుకు రూ. 2,800. ప్రైవేటు ఏ-కేటగిరీ సీటుకు సంవత్సరానికి రూ. 21 వేలు, బీ-కేటగిరీ సీటుకు రూ. 42 వేలు చెల్లించాలి.
 
 నిబంధనల మేరకు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉంది. ఈ సదుపాయం పొందాలంటే మాత్రం తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలి. ఈ క్రమంలో ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2లక్షలు, బీసీ/ఓబీసీ/పీహెచ్ విద్యార్థులు తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్ష ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందొ చ్చు. బీసీ/పీహెచ్, ఓసీ/పీహెచ్ అభ్యర్థులకు బీ-కేటగిరీ సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉండదు. వర్సిటీ ఫీజు కట్టాల్సిందే. ట్యూషన్ ఫీజు కోసం ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఆధారంగా ఆయా రిజర్వేషన్ కేటగిరీ సంక్షేమ శాఖా అధికారులు పరిశీలన అనంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హతను నిర్ణయిస్తారు.
 -రాజ్‌కుమార్ ఆలూరి, న్యూస్‌లైన్, విజయవాడ.
 
 కాలేజీల వివరాలు:
 బీఏఎంఎస్ కాలేజీలు -    వర్సిటీ భర్తీ చేసే సీట్లు
 డా॥ఎన్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల-విజయవాడ-    28
 డాక్టర్ బీఆర్‌కేఆర్ ఆయుర్వేద కాలేజీ-హైదరాబాద్    -48
 ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల-వరంగల్-    49
 ఎస్వీ ఆయుర్వేద కళాశాల-తిరుపతి-    39
 
 బీహెచ్‌ఎంఎస్ కాలేజీలు-    
వర్సిటీ భర్తీ చేసే సీట్లు

 డా॥గురురాజు ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాల-గుడివాడ-    39
 డా॥అల్ల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల-రాజమండ్రి-    49
 జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాల- హైదరాబాద్-    59
 ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాల-కడప    -29
 
 ప్రైవేట్ కాలేజీలు: దేవ్స్ హోమియో కళాశాల-అంకిరెడ్డిపల్లి (రంగారెడ్డి జిల్లా) సీట్లు: ఏ-కేటగిరీ 25, బీ-కేటగిరీ 5. మహారాజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియో కళాశాలల విజయనగరం, సీట్లు: ఏ-కేటగిరీ 25, బీ-కేటగిరీ 10.
 బీఎన్‌వైఎస్: గాంధీ నేచురోపతిక్ మెడికల్ కళాశాల-హైదరాబాద్ 30 సీట్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement