ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు బీఈడీ, ఎంఈడీ సిలబస్‌ల మార్పు చేపట్టిన ఎన్‌సీటీఈ మరో కీలక చర్య తీసుకుంది. బుద్ధిమాంద్యం, ఇతర శారీరక బలహీనతలు ఉన్న విద్యార్థులకు శిక్షణనిచ్చే నైపుణ్యాలను బీఈడీ, ఎంఈడీ విద్యార్థులకు అందించే విధంగా ఈ రెండు కోర్సుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్‌ను ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరి చేసింది. ఈ మేరకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఇప్పటి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పూర్తిస్థాయి కోర్సులను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది.
దీనివల్ల ఆ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకే శారీరక, మానసిక వికలాంగులైన చిన్నారులకు బోధించే నైపుణ్యాలు లభిస్తున్నాయి. అలాంటి విద్యార్థులకు కేవలం స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లు మాత్రమే విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉంటున్నాయి. అయితే గత ఏడాది నేషనల్ శాంపుల్ సర్వే అంచనాల ప్రకారం- 6-13 సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్నారుల్లో దాదాపు ఆరు లక్షల మంది శారీరక, మానసిక వికలాంగులు తమ వైకల్యం కారణంగా స్కూళ్లకు దూరంగా ఉన్నారు.
దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్‌సీటీఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బీఈడీ, ఎంఈడీ కోర్సు చేసిన అభ్యర్థులందరికీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లోనూ శిక్షణ లభిస్తుందని, ఫలితంగా తమకు సమీపంలోని స్కూళ్లలోనూ శారీరక, మానసిక వికలాంగ చిన్నారులు విద్యనభ్యసించే అవకాశం లభిస్తుందని ఎన్‌సీటీఈ వర్గాలు తెలిపాయి.
బీఈడీ, ఎంఈడీ సిలబస్‌లోనూ స్పెషల్ ఎడ్యుకేషన్
Published Mon, Apr 20 2015 12:58 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement