ప్రతిష్టాత్మక ఐఐఎంలలో మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రాంల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2015 నోటిఫికేషన్ విడుదలైంది. 2016-17 విద్యాసంవత్సరంలో 19 ఐఐఎంల్లో ప్రవేశాలకు క్యాట్ నిర్వహణ
బాధ్యతలు ఐఐఎం-అహ్మదాబాద్ నిర్వహిస్తోంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ల్లో వివిధ మేనేజ్‌మెంట్ పోస్టు గ్రాడ్యుయేట్, ఫెలో ప్రోగ్రామ్స్‌లో చేరడానికి క్యాట్‌లో సత్తా చాటాల్సిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఐఐఎంలు రెండో దశ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రత్యేకంగా రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాన్ని కల్పిస్తాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఆన్‌లైన్‌రిజిస్ట్రేషన్: ఆగస్టు 6-సెప్టెంబరు 20
పరీక్ష తేది: నవంబరు 29
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 650 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష విధానం:
రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ను కచ్చితంగా 60 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలతోపాటు వన్ వర్డ్ ఆన్సర్ ప్రశ్నలు కూడా ఉంటాయి.
సెక్షన్-1 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 34
సెక్షన్-2 డేటా ఇంటర్‌ప్రిటేషన్
అండ్ లాజికల్ రీజనింగ్ 32
సెక్షన్-3 వెర్బల్ అండ్ రీడింగ్
కాంప్రెహెన్షన్ 34
మొత్తం మార్కులు 100
పరీక్ష కాల వ్యవధి: 180 నిమిషాలు.
క్యాట్-2015 ద్వారా ప్రవేశం కల్పించే ఐఐఎం క్యాంపస్‌లు:
విశాఖపట్నం, అహ్మదాబాద్, అమృత్‌సర్, బెంగళూరు, బోధ్‌గయా, కలకత్తా, ఇండోర్, కాశీపూర్, కొజీకోడ్, లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, రోహ్‌తక్, సంబల్‌పూర్, షిల్లాంగ్, సిర్‌మౌర్, తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్.
ప్రోగ్రామ్స్:
పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(పీజీపీ), పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్(పీజీపీ-ఎఫ్‌ఏబీఎం), పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్(పీజీపీఈఎం), పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీపీఎం), పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం), ఎగ్జిక్యూటివ్ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఈపీజీపీ), ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఎఫ్‌పీఎం) మొదలైనవి.
వెబ్‌సైట్: https://iimcat.ac.in
క్యాట్ 2015
Published Thu, Jul 30 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement