(నిన్నటి ‘విద్య’ తరువాయి)
103. అక్బర్ కాలంలో ఇతర భాషల్లోకి అనువ దించని సంస్కృత గ్రంథం ఏది?
1) మహాభాష్యం 2) హరివంశం
3) పంచతంత్రం 4) రాజతరంగిణి
104. {పపంచ కళారంగంలో ‘త్రిమూర్తులు’గా ప్రసిద్ధి చెందినవారు?
1) పెట్రార్‌క, డావిన్సీ, రాఫెల్
2) డావిన్సీ, రాఫెల్, మైఖేలాంజిలో
3) ఇరాస్మస్, డావిన్సీ, పెట్రార్‌క
4) మైఖేలాంజిలో, డావిన్సీ, ఇరాస్మస్
105. నిరంతరంగా వరదలు ముంచెత్తడం వల్ల ధ్వంసమైన సింధూలోయ నాగరికత నగరం?
1) లోథాల్ 2) కాలీబంగన్
3) హరప్పా 4) మొహంజొదారో
106. అభిదమ్మపీటకాన్ని ఎక్కడ నిర్వహించిన బౌద్ధ సంగీతిలో రూపొందించారు?
1) రాజగృహం 2) వైశాలి
3) పాటలీపుత్రం 4) కుందలవనం
107. అశోకుడు వేయించిన శిలాశాసనాలు ఏ లిపిలో ఉన్నాయి?
1) పాళీ 2) బ్రాహ్మి
3) ప్రాకృత 4) సంస్కృతం
108. ‘కవిరాజు’ అనే బిరుదు ఎవరిది?
1) సముద్రగుప్తుడు 2) హర్షుడు
3) మొదటి చంద్రగుప్తుడు 4) హాలుడు
109. రాజ్యాన్ని ‘ఇక్తాలు’ (సైనిక రాష్ట్రాలు)గా విభజించిన ఢిల్లీ సుల్తాన్?
1) బాల్బన్ 2) ఇల్‌టుట్‌మిష్
3) అల్లావుద్దీన్ ఖిల్జీ
4) మహ్మద్‌బిన్ తుగ్లక్
110. ఢిల్లీలోని ‘పురానాఖిల్లా’ను నిర్మించిన వారు?
1) అక్బర్ 2) షాజహాన్
3) షేర్షా 4) జహంగీర్
111. ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్‌తో హైదరాబాద్ నిజాం సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకున్నాడు?
1) కారన్‌వాలీస్ 2) వెల్లస్లీ
3) డల్హౌసీ 4) కానింగ్
112. ‘రామకృష్ణ మిషన్’ను ఎప్పుడు స్థాపించారు?
1) 1897 2) 1893
3) 1894 4) 1898
113. మహాత్మాగాంధీ రాజకీయ గురువు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) గోవిందరనడే 4) గోపాలకృష్ణ గోఖలే
114. హిందూస్థాన్ రిపబ్లికన్ సైన్యాన్ని రూపొం దించినవారెవరు?
1) సూర్యసేన్ 2) సుభాష్ చంద్రబోస్
3) భగత్‌సింగ్ 4) ఆజాద్ చంద్రశేఖర్
115. ‘శాసనోల్లంఘనోద్యమంగా’గా పేరు గాంచింది?
1) సహాయ నిరాకరణోద్యమం
2) హోంరూల్ ఉద్యమం
3) దండి ఉద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
Civics (15 Marks)
116. ఆదర్శ రాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నవారెవరు?
1) అరిస్టాటిల్ 2) హెగెల్
3) హబ్స్ 4) కారల్‌మార్‌క్స
117. ‘లౌకిక రాజ్యం’ అంటే?
1) రాజ్యంలో ఏ మతం ఉండదు
2) అన్ని మతాల కార్యకలాపాలను
రాజ్యం నిర్దేశిస్తుంది
3) మతం అనేది వ్యక్తి స్వవిషయం కాదు
4) ఏదీకాదు
118. హక్కులు రాజ్యాంగం అంతరాత్మ అని పేర్కొన్న వారెవరు?
1) అంబేద్కర్ 2) నెహ్రూ
3) గాంధీ 4) ఆస్టిన్
119. {పజాస్వామ్య విజయానికి అతి ఎక్కువగా తోడ్పడేది?
1) రాజకీయ చైతన్యం 2) విద్య
3) నైతిక విలువలు
4) అధికార వికేంద్రీకరణ
120. ‘పాలిటిక్స్’ గ్రంథాన్ని రచించినవారు?
1) డైసీ 2) జాన్ లాక్
3) అరిస్టాటిల్ 4) థామస్ హబ్స్
121. కింది వాటిలో దృఢ రాజ్యాంగానికి సంబంధించి ప్రయోజనం కానిది ఏది?
1) సమాఖ్య రాజ్యాలకు ఉపయోగం 2) రాజ్యాంగానికి స్థిరత్వం ఉంటుంది
3) {పభుత్వ పరిపాలనా సామర్థ్యం పెరుగుతుంది
4) న్యాయ సమీక్ష అధికారానికి ప్రభుత్వ చట్టాలు అధికంగా గురవుతాయి.
122. ఏ దేశంలో ఎగువసభ సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోరు?
1) ఇండియా 2) అమెరికా
3) ఆస్ట్రేలియా 4) పైవన్నీ
123. హైకోర్టు న్యాయమూర్తుల గరిష్ట వయోపరిమితి ఎన్నేళ్లు?
1) 58 2) 60
3) 62 4) 65
124. భారత రాజ్యాంగ పరిషత్తు సలహా దారుడిగా సేవలందించినవారెవరు?
1) హెచ్.వి. ఆర్. అయ్యంగార్
2) బి.ఎన్. రావు 3) ఎస్.ఎన్. ముఖర్జీ
4) అంబేద్కర్
125. రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో స్థానిక ప్రభుత్వాలు అనే భావనను చేర్చారు?
1) 3 2) 4 3) 5 4) 6
126. రాష్ర్టపతి జారీచేసిన ఆర్టినెన్‌సలు ఎంత కాలం అమల్లో ఉంటాయి?
1) 6 వారాలు 2) 30 రోజులు
3) పార్లమెంట్ తిరిగి సమావేశమైన ఆరు వారాల వరకు
4) పార్లమెంట్ తిరిగి సమావేశమైన 30 రోజుల వరకు
127. రాజ్యాంగంలోని 326వ ప్రకరణ ఏం చెబుతోంది?
1) లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు వయోజన ఓటింగ్ హక్కు ప్రాతి పదికన ఎన్నికలు నిర్వహించాలి
2) 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలి
3) అన్ని చట్టసభలకు వయోజన ఓటింగ్ హక్కు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి
4) {పభుత్వ నిబంధనల మేరకు ఓటు హక్కు ఉండాల్సిన కనీస వయసు నిర్ణయించాలి
128. సమన్యాయ పాలనలో ఎవరికి ప్రాధాన్యం ఉంటుంది?
1) ప్రజలు 2) చట్టాలు
3) పాలకులు 4) న్యాయస్థానాలు
129. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేని దేశం?
1) తైవాన్ 2) నౌరు
3) వాటికన్ సిటీ 4) పైవన్నీ
130. అలీనోద్యమ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
1) 1950 2) 1954
3) 1958 4) 1961
ఉఛిౌౌఝజీఛిట (20 క్చటజుట)
131. ఒక నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి కల్పనలున్న భారీ పరిశ్రమ, వ్యవసాయ రంగాలను ఏ రంగంలో ఉన్నవిగా చెప్పవచ్చు?
1) వ్యవస్థీకృత 2) అవ్యవస్థీకృత
3) మౌలిక 4) ప్రభుత్వ
132. లాభదాయకమైన ఉపాధి కల్గిన వ్యక్తులు తమ పూర్తి శక్తి మేరకు పనిచేయని స్థితిని ఏ రకమైన నిరుద్యోగంగా పిలుస్తారు?
1) స్వచ్ఛంద 2) అనిచ్ఛాపూర్వక
3) ప్రచ్ఛన్న 4) నిర్మాణాత్మక
133. ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల వల్ల ధరల స్థాయిలో ఏర్పడిన పెరుగుదలను ఏ రకమైన ద్రవ్యోల్బణం అంటారు?
1) డిమాండ్ పుల్ 2) కాస్ట్ పుష్
3) బహిరంగ 4) అణచి ఉంచిన
134. గరీబి హఠావో అనే నినాదానికి ప్రాధాన్యం ఇచ్చిన పంచవర్ష ప్రణాళికను ఏ కాలంలో అమలు చేశారు?
1) 1961-66 2) 1963-68
3) 1969-74 4) 1965-70
135. వస్తువు ధరలో మార్పు ఫలితంగా దాని వినియోగంలో మార్పు రానట్లయితే, వస్తువు డిమాండ్ ఏవిధంగా ఉంటుంది?
1) సంపూర్ణ వ్యాకోచత్వం
2) సంపూర్ణ అవ్యాకోచత్వం
3) అసంపూర్ణ వ్యాకోచత్వం
4) అసంపూర్ణ అవ్యాకోచత్వం
136. {పభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయాల కంటే, మొత్తం వ్యయం అధికంగా ఉండే లోటు ఏది?
1) ప్రాథమిక 2) రెవెన్యూ
3) కోశ లోటు 4) బడ్జెట్ లోటు
137. ప్రాథమిక వ్యయాలు అంటే?
1) అవస్థాపన వ్యయాలు
2) ప్రత్యక్ష వ్యయాలు
3) స్థిర వ్యయాలు 4) ప్రత్యేక వ్యయాలు
138. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ప్రకారం ఒక్కో ఉత్పత్తి కారకానికి చెల్లించే ధరకు ఆధారం ఏది?
1) ఉత్పత్తి కారకం మొత్తం ఉత్పాదకత
2) ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పాదకత
3) ఉత్పత్తి కారకం సగటు ఉత్పాదకత
4) ఉత్పత్తి కారకం సాపేక్ష ఉత్పాదకత
139. భౌతికమైన ఉత్పాదకాలకు, భౌతిక ఉత్పత్తికి మధ్య ఉండే ఫలభావ సంబంధాన్ని ఏమంటారు?
1) డిమాండ్ ఫలం 2) వినియోగ ఫలం
3) పెట్టుబడి ఫలం 4) ఉత్పత్తి ఫలం
140. ఒక నిర్దిష్ట సంవత్సరంలో, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల సృష్టించిన అంతిమ వస్తు సేవల విలువలను ఏమంటారు?
1) మార్కెట్ ధరల్లో నికర దేశీయోయోత్పత్తి
2) మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి
3) మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి
4) మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి
141. రెపో రేటు అంటే?
1) ఖఆఐ వసూలు చేసే దీర్ఘకాలిక వడ్డీ రేటు
2) ఖఆఐ వసూలు చేసే స్వల్పకాలిక వడ్డీరేటు
3) ఖఆఐ చెల్లించే దీర్ఘకాలిక వడ్డీరేటు
4) ఖఆఐ చెల్లించే స్వల్పకాలిక వడ్డీరేటు
142. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 2005 2) 2006
3) 2007 4) 2008
143. కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ చేసే సంస్థ?
1) ప్రణాళికా సంఘం
2) జాతీయాభివృద్ధి మండలి
3) ఆర్‌బీఐ
4) ఆర్థిక సంఘం
144. మానవుడి అపరిమితమైన కోరికల గురించి అర్థశాస్త్ర నిర్వచనంలో చెప్పినవారెవరు?
1) మార్షల్ 2) ఆడం స్మిత్
3) రాబిన్‌స 4) శామ్యూల్‌సన్
145. క్షీణోపాంత ప్రయోజన సూత్రం గురించి మొదట వివరించిన వారు?
1) గాసెన్ 2) బోల్డింగ్
3) వెబ్లెన్ 4) రాబిన్‌సన్
146. ఏ మార్కెట్‌లోనైనా వ్యయరేఖలు ఎప్పుడూ ఏ ఆకారంలో ఉంటాయి?
1) ఔ 2) 3) గ 4) ్ఖ
147. జాతీయాభివృద్ధి మండలి అధ్యక్షుడు?
1) రాష్ర్టపతి 2) ప్రధానమంత్రి
3) ఆర్థిక సంఘం చైర్మన్
4) ఆర్థికశాఖ మంత్రి
148. కింది వాటిలో పరోక్ష పన్ను కానిది?
1) సేవాపన్ను 2) ఎక్సైజ్ పన్ను
3) కార్పొరేషన్ పన్ను
4) కస్టమ్స్ పన్ను
149. వాస్తవిక వేతనం అంటే?
1) యజమాని శ్రామికుడికి చెల్లించే ద్రవ్యవేతనం
2) {శామికుడు పొందిన వేతనానికి ఉండే కొనుగోలు శక్తి
3) {శామికుడి శ్రమకు యజమాని చెల్లించే నిజ వేతనం
4) యజమాని పొందిన వాస్తవ ఆదాయంలో శ్రామికుడి వాటా
150. ‘సప్లయ్ తన డిమాండ్‌ను తానే సృష్టించుకుంటుంది’ అనే భావనను ప్రతిపాదించింది?
1) సే మార్కెట్ సూత్రం
2) కీన్‌స ఆదాయ సూత్రం
3) వాకర్ డిమాండ్ సూత్రం
4) పిగూ సప్లయ్ సూత్రం
సమాధానాలు
103) 1; 104) 2; 105) 4; 106) 3; 107) 2; 108) 1; 109) 2; 110) 3; 111) 2; 112) 1; 113) 4; 114) 1; 115) 3; 116) 2; 117) 4; 118) 2; 119) 4; 120) 3; 121) 4; 122) 1; 123) 3; 124) 2; 125) 2; 126) 3; 127) 1; 128) 2; 129) 4; 130) 4; 131) 1; 132) 3; 133) 2; 134) 3; 135) 2; 136) 4; 137) 1; 138) 2; 139) 4; 140) 3; 141) 2; 142) 1; 143) 4; 144) 3; 145) 1; 146) 4; 147) 2; 148) 3; 149) 2; 150) 1.
(ఈ ప్రశ్న పత్రాన్ని రూపొందించిన వారు:
జనరల్ ఇంగ్లిష్: కె. లలిత
జీకే, టీచింగ్ ఆప్టిట్యూడ్, సోషల్:
బొమ్మనబోయిన శ్రీనివాస్)
ఎడ్.సెట్ (సాంఘిక) మోడల్ పేపర్
Published Wed, May 28 2014 9:37 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement