ఇగ్నో- పీజీ డిప్లొమా
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ‘పీజీ డిప్లొమా ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
కోర్సు కాల వ్యవధి: ఏడాది.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా రూ.200 చెల్లించి ఇగ్నో ప్రాంతీయ కార్యాలయాలతో పాటు, ఇగ్నో అధ్యయన కేంద్రాల నుంచి పొందవచ్చు.
ప్రవేశ రుసుం: రూ.2,800.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 20
వెబ్‌సైట్: www.ignou.ac.in
ఐఐహెచ్‌ఎంఆర్‌లో పీజీ డిప్లొమా
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ (ఐఐహెచ్‌ఎంఆర్) బెంగళూరు, జైపూర్, ఢిల్లీ క్యాంపస్‌లలో కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు:
పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్
పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్
పీజీ డిప్లొమా ఇన్ ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్
పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ మేనేజ్‌మెంట్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. క్యాట్/మ్యాట్/సీమ్యాట్/ఎక్స్‌ఏటీ/ఏటీఎంఏ ర్యాంకు ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూలై 8
వెబ్‌సైట్: www.iihmr.org
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ వర్సిటీ
హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎన్జీరంగా వర్సిటీతోపాటు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం (పశ్చిమ గోదావరి) లోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో కింది యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు:
బీఎస్సీ (అగ్రికల్చర్)
బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్)
బీవీఎస్సీ అండ్ ఏహెచ్
బీఎఫ్‌ఎస్సీ, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్.
అర్హత: ఎంసెట్-2014(మెడిసిన్) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
బీఎస్సీ హానర్స్
విభాగాలు: హోమ్‌సైన్స్ (బాలికలకు మాత్రమే), ప్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్.
అర్హత: ఇంటర్ (బైపీసీ)/ తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూలై 10
వెబ్‌సైట్: www.angrau.ac.in
ప్రవేశాలు
Published Sat, Jun 14 2014 4:45 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement