ప్రాక్టికల్ విద్యకు చిరునామా.. ఫ్రాన్స్ | France Practical education will have more opportunities in foreign | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్ విద్యకు చిరునామా.. ఫ్రాన్స్

Published Thu, Feb 5 2015 10:26 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

ప్రాక్టికల్ విద్యకు చిరునామా.. ఫ్రాన్స్ - Sakshi

ప్రాక్టికల్ విద్యకు చిరునామా.. ఫ్రాన్స్

ఉన్నత ప్రమాణాలు.. అత్యున్నత సౌకర్యాలు.. అందివస్తున్న అవకాశాల నేపథ్యంలో ఫారెన్ ఎడ్యుకేషన్ దిశగా దృష్టి సారిస్తున్న విద్యార్థులెందరో! ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్ ఇలా అన్ని రంగాలకు చెందిన విద్యార్థులు.. ఉన్నత విద్యకోసం విదేశీ వర్సిటీలవైపు
చూస్తున్నారు. ఈ క్రమంలో సంప్రదాయ గమ్యాలుగా నిలుస్తున్న అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ కాకుండా ప్రాక్టికల్ విద్యకు చిరునామాగా నిలుస్తోన్న ఐరోపా దేశం.. ఫ్రాన్స్‌ను ఎంచుకుంటున్నారు.. అక్కడి విద్యా విధానం, ప్రవేశప్రక్రియ తదితర అంశాలపై విశ్లేషణ..
 
 అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తర్వాత అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశం ఫ్రాన్స్. వివిధ దేశాలకు చెందిన 278,000 (మొత్తం విద్యార్థుల్లో 12 శాతం) మంది విద్యార్థులు ఇక్కడి యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో డాక్టోరల్ కోర్సుల్లో చేరిన వారి సంఖ్య దాదాపుగా 25 వేలు.
 
 అవసరాలకనుగుణంగా
 ఫ్రాన్స్ విద్యా వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రభుత్వం విద్య, పరిశోధనలకు ఏటా బడ్జెట్‌లో 20 శాతం నిధులను కేటాయిస్తోంది. పరిశ్రమ అవసరాలకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఇక్కడి విద్యా విధానం ప్రత్యేకత. జాబ్ మార్కెట్ కోరుకుంటున్న నైపుణ్యాలను పెంపొందించేలా ప్రాక్టికల్ శిక్షణకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో యూనివర్సిటీల కరిక్యులంలో ఇంటర్న్‌షిప్స్ తప్పనిసరి. దీని ప్రకారం ప్రతీ యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్ రిఫరల్ సిస్టమ్, కెరీర్ సర్వీసెస్ విభాగం ఉంటుంది. ఈ విభాగం అందుబాటులోని ఇంటర్న్‌షిప్, ఉద్యోగావకాశాల గురించి విద్యార్థులకు సమాచారాన్ని ఇస్తుంది. ఫ్రెంచ్ ఎడ్యుకేషన్ మరో ప్రత్యేకత.. ఫుల్, పార్ట్ టైమ్ విధానంలో కాలేజీలకు హాజరయ్యే సౌలభ్యం. మరికొన్ని యూనివర్సిటీలు కంప్యూటర్ ద్వారా ఇంటి నుంచి కోర్సును పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
 
 ఎల్‌ఎండీ
 ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ దేశాలు అనుసరిస్తున్న ఎల్‌ఎండీ (ఔకఈ) విద్య విధానాన్నే అమలు చేస్తుంది. ఇందులో ఎల్ అంటే లెసైన్స్, ఎం అంటే మాస్టర్, డీ అంటే డాక్టోరల్ కోర్సులు. వీటిని షార్ట్, లాంగ్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లుగా విభజించారు. షార్ట్ ప్రోగ్రామ్‌ల వ్యవధి 2-3 సంవత్సరాలు. యూనివర్సిటీలు లేదా స్పెషలైజ్డ్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో భాగంగా ఏదైనా సంస్థలో తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ ప్రోగ్రామ్‌లను యూనివర్సిటీలు ఆఫర్ చేస్తాయి. ఇందులో లెసైన్స్, మాస్టర్ అనే రెండు రకాలు కోర్సులు ఉంటాయి. లెసైన్స్ కోర్సు వ్యవధి మూడేళ్లు (ఆరు సెమిస్టర్లు). ఇవి బ్యాచిలర్ కోర్సులు. మాస్టర్ కోర్సుల వ్యవధి ఐదేళ్లు (10 సెమిస్టర్లు). ఇందులో రీసెర్చ్, ప్రొఫెషనల్ అనే రెండు రకాల కోర్సులు ఉంటాయి. రీసెర్చ్ కోర్సులను ఎంచుకున్న వారికి తర్వాత డాక్టోరల్ డిగ్రీ చేసే అవకాశం లభిస్తుంది. కొన్ని మాస్టర్ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు కూడా ఉంటుంది. డాక్టోరల్ కోర్సుల వ్యవధి ఎనిమిదేళ్లు (16 సెమిస్టర్లు).
 
 
 సెమిస్టర్-క్రెడిట్లు
 ఫ్రాన్స్‌లో విద్యా సంవత్సరం సెప్టెంబర్/అక్టోబర్‌లో ప్రారంభమై మే/జూన్‌లో ముగుస్తుంది. క్రిస్‌మస్, నూతన సంవత్సరం సందర్భంగా మధ్యలో రెండు వారాలు సెలవులు ఉంటాయి. జూలై, ఆగస్టు రెండు నెలలు వేసవి సెలవులు ఉంటాయి. కోర్సు నిర్వహణలో సెమిస్టర్ విధానం అమల్లో ఉంది. ఏటా రెండు సెమిస్టర్లు ఉంటాయి. పూర్తి చేసిన సెమిస్టర్లు, సాధించిన క్రెడిట్ల ఆధారంగా డిగ్రీలను అందజేస్తారు. కావల్సిన అర్హతలు..బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్, మాస్టర్ కోర్సులకు మూడు/ నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ, డాక్టోరల్ కోర్సులకు మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం. ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌టీఎస్) స్కోర్ ఆధారంగా ఇక్కడి యూని వర్సిటీల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇందుకోసం స్కోర్ 6.5 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మేనేజ్‌మెంట్ కోర్సులకు జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. క్రెడిట్ పద్ధతిలో మూల్యాంకనం ఉంటుంది. ఇందుకోసం యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ అండ్ అక్యూమలేషన్ సిస్టమ్ (ఉఇఖీ) అనే విధానాన్ని అనుసరిస్త్తారు. ఈ క్రమంలో లెసైన్స్ కోర్సులను పూర్తి చేయడానికి 180 క్రెడిట్లు, మాస్టర్ కోర్సులకు 300 క్రెడిట్లు అవసరం.
 
 ఫ్రెంచ్ తప్పనిసరికాదు
 ఫ్రాన్స్‌లో చదవాలంటే ఫ్రెంచ్ భాష వచ్చి ఉండాలనే నిబంధన ఏమీ లేదు. కాకపోతే అక్కడి సమాజంతో మమేకం కావడానికి ఫ్రెంచ్ భాషపై అవగాహన ఉండటం ప్రయోజనకరం. ఇతర దేశాల మాదిరిగానే ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉంటుంది. ఇక్కడ మొత్తం 917 కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తారు. ఇందులో సైన్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, టూరిజం, లా, డిజైన్, ఫ్యాషన్, అగ్రికల్చర్, హోటల్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, హెల్త్ సెన్సైస్, మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో న్యూక్లియర్, స్పేస్, ఏవియేషన్, టీచింగ్, సోషియాలజీ, లింగ్విస్టిక్స్, జాగ్రఫీ, బిజినెస్, ఎకనామిక్స్, ఫ్యాషన్, ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువ.
 
 ఫీజులు-స్కాలర్‌షిప్‌లు
 ఫ్రాన్స్‌లో 85 పబ్లిక్ ఫండింగ్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి నిర్వహణకు ఫ్రెంచ్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కాబట్టి ఫీజులు స్వల్పంగానే ఉంటాయి. ఇక్కడ 250 ఇంజనీరింగ్ స్కూల్స్, 220 బిజినెస్ స్కూల్స్, 291 డాక్టోరల్ డిపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఇవే కాకుండా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్పెషలైజ్డ్ స్కూల్స్ (ప్రత్యేక రంగానికి సంబంధించినవి, ఉదాహరణ-యానిమేషన్, ఫ్యాషన్), కెథలిక్ యూనివర్సిటీలు ఉంటాయి. ఫీజులను ప్రత్యేక చట్టం ద్వారా నిర్ణయిస్తారు. ఈ క్రమంలో లెసైన్స్ కోర్సులకు రూ.11-13 లక్షలు (189,10 యూరోలు), మాస్టర్ కోర్సులకు రూ.15-19 లక్షలు (261,10 యూరోలు), డాక్టోరల్ కోర్సులకు రూ.25-28 లక్షలు (396,10 యూరోలు), మేనేజ్‌మెంట్ కోర్సులకు రూ.2-8 లక్షలు (3-10 వేల యూరోలు), ఇంజనీరింగ్ కోర్సులకు 610 యూరోలు అవసరం. పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్‌లతో పోల్చితే ప్రైవేట్ సంస్థల్లో ఫీజులు కొంచెం అధికంగా ఉంటాయి. విదేశీ విద్యార్థుల కోసం పలు రకాల స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. క్యాంపస్ బోర్సెస్ (ఇ్చఝఞఠట ఆౌఠటట్ఛట) పోర్టల్ ద్వారా స్థానిక సంస్థలు, ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, ఇన్‌స్టిట్యూట్‌లు అందజేస్తున్న స్కాలర్‌షిప్ వివరాలను తెలుసుకోవచ్చు.
 
 వసతి
 ఫ్రాన్స్‌లో ఆహారం, వసతి, రవాణా తదితరాల కోసం నెల కు రూ.40-55 వేలు (600-800 యూరోలు) అవసరం. వసతి విషయానికొస్తే.. అధిక శాతం విద్యార్థులకు యూనివర్సిటీ రెసిడెన్స్‌లో నివాస సౌకర్యం కల్పిస్తారు. ఇందుకోసం నెలకు రూ.8-24 వేలు (120-350 యూరోలు) చెల్లించాలి. ఇవికాకుండా ప్రైవేట్ స్టూడెంట్ బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్, ప్రభుత్వం అందించే హౌజింగ్ సౌకర్యం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా వసతి ఖర్చులను అక్కడి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.
 
 పార్ట్‌టైమ్ జాబ్
 విద్యార్థుల అవసరాల మేరకు పార్ట్‌టైమ్ జాబ్ చేసే సౌకర్యం కూడా ఉంది. ఇందుకు కోర్సు వ్యవధిలో సగం సమయాన్ని పార్ట్‌టైమ్ జాబ్ కోసం కేటాయించవచ్చు. ఈ క్రమంలో సంవత్సరానికి 964 గంటలు పార్ట్‌టైమ్ జాబ్ చేయవచ్చు. అయితే ఇందుకు రెసిడెంట్ పర్మిట్ ఉండాలి. ఫ్రాన్స్‌లో జాతీయ కనీస వేతన చట్టం అమల్లో ఉంది. ఈ మేరకు గంటల చొప్పున వేతనం చెల్లిస్తారు. అంతేకాకుండా యూనివర్సిటీలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ జాబ్స్ ఉంటాయి. వీటి కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టోరల్ కోర్సులను చదివే విద్యార్థులకు నెలకు రూ. లక్ష (1685 యూరోలు) లభిస్తాయి. దీనికి అదనంగా టీచింగ్, కన్సల్టింగ్ వంటి వృత్తులను ఎంచుకుంటే నెలకు రూ. లక్ష 40 వేలు (2025 యూరోలు) సంపాదించవచ్చు. సీఐఎఫ్‌ఆర్‌ఈ విధానంలో యూనివర్సిటీతోపాటు ఏదైనా కార్పొరేట్ సంస్థలో సమాంతరంగా రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. మాస్టర్ డిగ్రీ తర్వాత నిబంధనల మేరకు అక్కడే ఉద్యోగం చేసే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం టెంపరరీ రెసిడెంట్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు 12 నెలలపాటు ఉద్యోగం చేయవచ్చు.
 
 ఒకే మాధ్యమం ద్వారా
 అడ్మిషన్ ప్రక్రియ, వీసా కోసం ఒకే మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈక్రమంలో ముందుగా యూనివర్సిటీ, సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. తర్వాత సీఈఎఫ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో అడ్మిషన్ నుంచి వీసా వరకు ప్రతి దశకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ముందుగా www.india.campusfrance. org  ద్వారా ఆన్‌లైన్‌లో పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసి.. సంబంధిత వివరాలను పూర్తి చేయాలి. ఈ విధానంలోనే యూనివర్సిటీలు దరఖాస్తులను పరిశీలిస్తాయి. అర్హులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అడ్మిషన్ సంబంధిత సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తాయి. అంతేకాకుండా రాయబార కార్యాలయం వీసా దరఖాస్తును పరిశీలించడంతోపాటు మంజూరు చేస్తుంది. సాధారణంగా వీసా జారీకి రెండు వారాల నుంచి నెల రోజుల సమయం పడుతుంది. ఎంచుకున్న కోర్సును బట్టి వీసాను మంజూరు చేస్తారు. కోర్సు వ్యవధి 90 రోజుల కంటే ఎక్కువ ఉంటే లాంగ్ స్టే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
 
 ఇందుకు కావల్సిన ధ్రువపత్రాలు..
 యూనివర్సిటీ ధ్రువీకరించిన అడ్మిషన్ లెటర్
 ఫైనల్ అడ్మిషన్ లెటర్
 ప్రాన్స్‌లో వసతి సౌకర్యాన్ని ధ్రువీకరించే ఆధారాలు
 ఆర్థిక వనరులను సూచించే పత్రాలు
 ఓవర్సీస్ మెడికల్ ఇన్సూరెన్స్
 అకడమిక్ సర్టిఫికెట్లు
 రెజ్యూమె  పాస్‌పోర్ట్
 
 పరిశ్రమ అవసరాలకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఫ్రెంచ్ విద్య ప్రత్యేకత. ఇందుకోసం సిలబస్‌లో ఇంటర్న్‌షిప్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఫ్రాన్స్‌లో చదవాలంటే ఫ్రెంచ్ భాష వచ్చి ఉండాలనే నిబంధన ఏమీ లేదు. కాకపోతే అక్కడి సమాజంతో మమేకం కావడానికి ఫ్రెంచ్‌పై అవగాహన ఉండటం ప్రయోజనకరం. ఇతర దేశాల మాదిరిగానే విదేశీ విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమంంలోనే బోధన ఉంటుంది. ఐఈఎల్‌టీఎస్ స్కోర్ (6.5 లేదా ఎక్కువ) ఆధారంగా ప్రవేశం పొందొచ్చు. పబ్లిక్ యూనివర్సిటీలతోపాటు ప్రైవేట్ ఫీజులు కొంచెం అధికం. అక్కడి ప్రభుత్వం ఇస్తున్న రాయితీల కారణంగా ఇతర దేశాలతో పోల్చితే ఫ్రాన్స్‌లో ఫీజలు చాలా తక్కువ. అంతేకాకుండా వసతి ఖర్చులను అక్కడి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. విదేశీ విద్యార్థుల కోసం ఎన్నో మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
 -వసుధ మురళీకృష్ణ, ఎడ్యుకేషన్ అడ్వైజర్, క్యాంపస్ ఫ్రాన్స్, హైదరాబాద్.
 
 గత పదేళ్లలో ఫ్రాన్స్‌కు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్య 75 శాతం పెరిగింది.
 ...................................................
 ఫ్రాన్‌‌స ప్రభుత్వం ఏటా రూ. 7.1 కోట్ల స్కాలర్‌షిప్‌లను భారతీయ విద్యార్థులకు అందజేస్తుంది.
 ...................................................
 ఫ్రెంచ్ విద్యార్థులతో సమానంగా విదేశీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, హెల్త్ కవరేజ్, హౌజింగ్ అసిస్టెంటెన్స్ వంటి సౌకర్యాలను కల్పిస్తారు.
 ...................................................
 యూజ్‌ఫుల్ వెబ్‌సైట్స్:
 www.campusfrance.org
 www.france.fr
 www.ambafrance&in.org
 www.diplomatie.gov.fr

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement