జనరల్ అవేర్‌నెస్ | General Awareness | Sakshi
Sakshi News home page

జనరల్ అవేర్‌నెస్

Published Sat, Mar 1 2014 10:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

జనరల్ అవేర్‌నెస్ - Sakshi

జనరల్ అవేర్‌నెస్

 1.    భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ సేవింగ్‌‌స బ్యాంక్ ఏటీఎంను 2014, ఫిబ్రవరి 27న ఎక్కడ ప్రారంభించారు?
       చెన్నై
 2.    ఫిబ్రవరి 28, 2014న అరెస్ట్ అయిన సహారా గ్రూప్ అధిపతి పేరు?
       సుబ్రతా రాయ్
 3.    ఫిబ్రవరి 2014లో వింటర్ ఒలింపిక్స్‌ను ఎక్కడ నిర్వహించారు?
       రష్యాలోని సోచి నగరంలో
 4.    2013 సంవత్సరానికి డాక్టర్ వై. నాయుడమ్మ అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్త పేరు?
       జయంత్ విష్ణు నార్లికర్
 5.    ఫిబ్రవరి 26, 2014న ముంబై తీరంలో ప్రమాదానికి గురైన భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి పేరు?
       ఐఎన్‌ఎస్ సింధురత్న
 6.    నావికాదళంలోని యుద్ధనౌకలు ఇటీవలి కాలంలో ప్రమాదాలకు గురవడంపై నైతిక బాధ్యత వహిస్తూ ఫిబ్రవరి 26, 2014న రాజీనామా చేసిన నావికాదళాధిపతి ఎవరు?
       అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి
 7.    జూలై 2013లో వింబుల్డన్ మహిళల టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను తొలిసారిగా ఎవరు సాధించారు?
       ఫ్రాన్‌‌సకు చెందిన మరియన్ బర్తోలి
 8.    ఆదిత్య మెహతా ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
       స్నూకర్
 9.    బాలలను ఏ వ్యాధి నుంచి రక్షించడానికి అక్టోబరు 2013లో జెన్‌వాక్ టీకాను అభివృద్ధి చేశారు?
       జపనీస్ ఎన్‌సెఫాలిటీస్ వ్యాధి
 10.    ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రగతి క్షిపణి అవధి ఎంత?
       60-170 కి.మీ.
 11.    ఆసియా యూత్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను అక్టోబరు 2013లో ఇండోనేషియాలో నిర్వహించారు. ఈ టోర్నీలో అండర్-15 బాలుర సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు?
       సిరిల్ వర్మ
 12.    డబ్లిన్ ఏ దేశానికి రాజధాని?
       ఐర్లాండ్
 13.    శ్రీలంక ప్రధాన న్యాయమూర్తిగా జనవరి 2013లో నియమితులైనవారు?
       మోహన్ పెరిస్
 14.    అమెరికా రక్షణ కార్యదర్శి ఎవరు?
       చక్ హేగెల్
 15.    ‘బ్లేడ్ రన్నర్’ అని ఎవరిని పిలుస్తారు?
       దక్షిణాఫ్రికాకు చెందిన అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌ను
 16.    ఫిబ్రవరి 2013లో దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
       పార్‌‌క గేన్ హై
 17.    రౌల్ కాస్ట్రో ఏ దేశానికి అధ్యక్షునిగా రెండోసారి ఫిబ్రవరి 2013లో ఎన్నికయ్యారు?
       క్యూబా
 18.    ముంబై 26/11 దాడుల కేసులో ఎవరికి అమెరికాలోని షికాగో న్యాయస్థానం 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది?
       పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి
 19.    ఫిబ్రవరి 2013లో ముంబైలో జరిగిన మహిళల ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో గెలుపొంది, ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగానిలిచింది. ఫైనల్‌లో ఆ జట్టు ఏ దేశాన్ని ఓడించింది?
       వెస్టిండీస్
 20.    ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2013 సంవత్సరానికి రూపొందించిన మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు దక్కిన స్థానం?
       136
 21.    మయన్మార్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు?
       ఆంగ్‌సాన్ సూకీ (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు)
 22.    పాకిస్థాన్ పార్లమెంట్ దిగువ సభ పేరు?
       నేషనల్ అసెంబ్లీ
 23.    2013 సంవత్సరానికి ఫోర్‌‌బ్స ప్రపంచ ఐశ్వర్యవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ‘కార్లోస్ స్లిమ్ హేలూ’ ఏ దేశానికి చెందిన వ్యాపారవేత్త?
       మెక్సికో
 24.    వాషింగ్‌టన్‌లోని శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం పొందిన శాస్త్రవేత్త?
       యు.ఆర్.రావు
 25.    2013 ఏబెల్ ప్రైజ్ ఎవరికి ప్రదానం చేశారు?
       బెల్జియంకు చెందిన పియరీ డెలిగ్నే
 26.    ఏబెల్ ప్రైజ్‌ను దేనికి ఇస్తారు?
       గణిత శాస్త్రంలో కృషికి
 27.    సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది?
       క్రికెట్
 28.    బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు?
       ముష్పికర్ రహీం
 29.    జాన్ బెట్స్ క్లార్‌‌క మెడల్‌ను ఏప్రిల్ 2013 లో గెలుచుకున్న భారత సంతతికి చెందిన అమెరికా ఆర్థిక వేత్త ఎవరు?
       రాజ్ చెట్టి
 30.    ఏప్రిల్ 2013లో బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ?
       షిరీన్ షర్మీన్ చౌదరి
 31.    మే 2013లో మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలుచుకున్నవారు?
       పి.వి.సింధు
 32.    ఇటీవల రిటైర్‌మెంట్ ప్రకటించిన సర్ అలెక్స్ ఫెర్గూసన్ ఏ  ఫుట్‌బాల్ క్లబ్‌కు మేనేజర్‌గా వ్యవహరించాడు?
       మాంచెస్టర్ యునెటైడ్
 33.    రంగస్వామి కప్ ఏ క్రీడకు సంబంధించింది?
       హాకీ
 34.    ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ ఏ దేశస్థుడు?
       ఇంగ్లండ్
 35.    మే 2013లో సుధీర్‌మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఏ దేశం గెలుచుకుంది?
       చైనా
 36.    2019 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది?
       ఇంగ్లండ్
 37.    హోరాసియో కార్‌‌ట్స ఆగస్టు 15, 2013న ఏ దేశానికి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు?
       పరాగ్వే
 38.    2013 సంవత్సరానికి టెంపుల్టన్ ప్రైజ్‌ను ఎవరు గెలుచుకున్నారు?
       దక్షిణాఫ్రికాకు చెందిన డెస్మండ్ టుటు
 39.    లాహోర్ జైల్లో ఖైదీల దాడిలో గాయపడిన భారత జాతీయుడు మే 2, 2013న మరణించాడు. ఆయన పేరు?
       సరబ్‌జిత్ సింగ్
 40.    పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు?
       పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్)
 41.    ఫోర్‌‌బ్స మ్యాగజీన్ ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి తొలిస్థానం దక్కించుకున్నవారు? (జాబితాను మే 22, 2013న విడుదల చేశారు)
       జర్మనీ ఛాన్‌‌సలర్ ఏంజెలా మెర్కల్
 42.    మే 2013లో నేషనల్ జియోగ్రాఫిక్ బీ పోటీలో విజేతగా నిలిచిన భారత అమెరికన్ బాలుడు?
       సాత్విక్ కార్నిక్
 43.    అమెరికన్ రచయిత్రి లిడియా డేవిస్‌కు
     2013లో ఏ అవార్డు లభించింది?
       మ్యాన్‌బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
 44.    ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి సౌదీ అరేబియా మహిళ?
       రాహా మొహారక్
 45.    ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి పాకిస్థానీ మహిళ?
       సమీనా బేగ్
 46.    ఎనిమిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను సాధించిన ఏకైక క్రీడాకారుడు?
       స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్
 47.    ఛాంపియన్‌‌స ట్రోఫీ క్రికెట్ ఫైనల్‌లో భారత జట్టు ఏ దేశంపై జూన్ 23, 2013న విజయం సాధించింది?
       ఇంగ్లండ్
 48.    {బిటన్‌కు చెందిన ‘ద ఇండిపెండెంట్’ అనే వార్తాపత్రికకు ఎడిటర్‌గా నియమితులైన భారతీయుడు?
       అమోల్ రాజన్
 49.    2013 సంవత్సరానికి ప్రపంచ ఆహార బహుమతి ఎవరికి లభించింది?
       బెల్జియంకు చెందిన మార్‌‌కవాన్ మాంటేగ్, అమెరికాకు చెందిన మేరీ డెల్ చిల్టన్, రాబర్‌‌ట ఫ్రేలీ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు
 50.    ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి, జూన్ 11, 2013న మరణించిన కేంద్ర మాజీ మంత్రి?
       వీసీ శుక్లా
 51.    ఇటీవల మరణించిన డగ్లస్ కార్‌‌ల ఎంగెల్ బర్‌‌ట దేన్ని తయారు చేశాడు?
       కంప్యూటర్ మౌస్
 52.    హిందీ చలన చిత్ర ప్రముఖ  నటుడు ప్రాణ్ జూలై 12, 2013న మరణించారు. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఏ సంవత్సరానికి లభించింది?
       2012
 53.    వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల వసూళ్లలో మార్పులు చేయడానికి ఏర్పాటైన రాష్ర్ట ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ కొత్త చైర్మన్‌గా అబ్దుల్ రహీం రాథేర్ జూలై 22, 2013న నియమితులయ్యారు. ఆయన ఏ రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి?
       జమ్మూకాశ్మీర్
 54.    {Mికెట్ ఒక్కరోజు అంతర్జాతీయ పోటీల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్?
       విరాట్ కోహ్లీ (52 బంతుల్లో వంద పరుగులు)
 55.    జూలై 1, 2013న జరిగిన కాన్ఫడరేషన్‌‌స కప్ ఫుట్‌బాల్ ఫైనల్ పోటీలో స్పెయిన్‌ను ఓడించి వరుసగా మూడోసారి టైటిల్‌ను సాధించిన దేశం?
       బ్రెజిల్
 56.    కాన్ఫడరేషన్‌‌స కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉత్తమ ఆటగాడిగా ఎంపికైనవారు?
       బ్రెజిల్‌కు చెందిన నేమార్
 57.    జూలై 2013లో విబుల్డన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను సాధించినవారు?
       బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే
 58.    జూలై 2013లో టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
       బ్రిటన్‌కు చెందిన క్రిస్ ఫ్రూమ్
 59.    సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను అక్టోబరు 2013లో ఏ జట్టుపై ఆడాడు?
       హర్యానా
 60.    మోహిత్ మయూర్, ప్రేరణ బాంబ్రి ఏ క్రీడలో ప్రసిద్ధులు?
       టెన్నిస్
 61.    భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు  ఉన్న దేశం?
       బంగ్లాదేశ్
 62.    పెటగోనియా ఎడారి ఏ ఖండంలో ఉంది?
       దక్షిణ అమెరికా
 63.    హరోడ్ డోయర్ నమూనాను ఏ పంచవర్ష ప్రణాళికలో అనుసరించారు?
       మొదటి
 64.    కామన్‌వెల్త్ సెక్రెటరీ జనరల్ ఎవరు?
       భారతదేశానికి చెందిన కమలేష్ శర్మ
 65.    అక్టోబరు 22, 2013 నాటికి ఏ డ్యామ్‌ను నిర్మించి యాభై ఏళ్ళు పూర్తయ్యాయి?
       భాక్రానంగల్ డ్యామ్
 66.    అక్టోబరు 16, 2013న రైల్వే బోర్‌‌డ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
       అరుణేంద్ర కుమార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement