జనరల్ అవేర్‌నెస్ | general awerness | Sakshi
Sakshi News home page

జనరల్ అవేర్‌నెస్

Published Fri, Jan 17 2014 11:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

జనరల్ అవేర్‌నెస్ - Sakshi

జనరల్ అవేర్‌నెస్

1.    12వ ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాలను జనవరి 7-9, 2014లో ఏ నగరంలో నిర్వహించారు?
     న్యూఢిల్లీ
 2.    మహిళల కోసం తయారు చేసిన తేలికపాటి తుపాకీ పేరు?
     నిర్భీక్
 3.    లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదు ర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి, ప్రస్తుత జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు?
     జస్టిస్ స్వతంతర్ కుమార్
 4.    2013 సంవత్సరానికి సి.కె. నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి
     లభించింది?
     కపిల్‌దేవ్
 5.    {పధాన సమాచార కమిషనర్‌గా డిసెంబర్ 20, 2013న ప్రమాణస్వీకారం చేసిన వారు?
     సుష్మాసింగ్
 6.    ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన భారత క్రికెటర్?
     ఛతేశ్వర్ పుజారా
 7.    ఐదోసారి మిజోరం ముఖ్యమంత్రిగా  ఎన్నికైన వారు?
     లాల్ తన్హావ్ల (కాంగ్రెస్)
 8.    యునిసెఫ్ పారిశుధ్య కార్యక్రమానికి  దక్షిణాసియా ప్రచార కార్యకర్తగా నియమి తులైనవారు?
     సచిన్ టెండూల్కర్
 9.    ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను ఏ దేశం నుంచి కొనుగోలు చేశారు?
     రష్యా
 10.    అంతర్జాతీయ వన్‌డే మ్యాచుల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో వ్యక్తి?
     రోహిత్ శర్మ
 11.    {Vేటర్ నోయిడాలో ఫార్ములావన్ ఇండియన్ గ్రాండ్‌ప్రీ టైటిల్‌ను సాధించి నవారు?
     సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ)
 12.    అక్టోబర్ 24, 2013న మరణించిన ప్రముఖ గాయకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత?
     మన్నాడే
 13.    నవంబర్ 19, 2013న ప్రారంభమైన భారతీయ మహిళా బ్యాంకు తొలి చైర్‌ప ర్సన్, మేనేజింగ్ డెరైక్టర్  ఎవరు?
     ఉషా అనంతసుబ్రమణియన్
 14.    2013-14కు హోమి జె.బాబా మెమోరి యల్ అవార్డు ఏ శాస్త్రవేత్తకు లభించింది?
     జి. సతీష్ రెడ్డి
 15.    20వ న్యాయ సంఘం నూతన చైర్మన్‌గా నవంబర్ 2013లో ఎవరిని నియ మించారు?
     జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా
 16.    2013 ఐసీసీ పీపుల్స్ ఛాయిస్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
     మహేంద్రసింగ్ ధోని
 17.    2013 ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీ కరణ, అభివృద్ధి బహుమతి ఎవరికి లభించింది?
     జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్
 18.    సచిన్ టెండూల్కర్, సి.ఎన్.ఆర్ రావుకు భారతరత్నను  ఎప్పుడు ప్రకటించారు?
     నవంబర్ 16, 2013
 19.    సెప్టెంబర్ 4, 2013న భారతీయ రిజర్‌‌వ బ్యాంక్‌కు ఎన్నో గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీ బాధ్యతలు చేపట్టారు?
     23వ
 20.    పన్నుల పాలనా సంస్కరణల కమిషన్ (ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్స్మ్ కమిషన్) చైర్మన్ ఎవరు?
     పార్ధసారథి షోమ్
 21.    దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళం సెంట్రల్ రిజర్‌‌వ పోలీస్ ఫోర్‌‌స డెరైక్టర్ జనరల్ ఎవరు?
     దిలీప్ త్రివేది
 22.    ‘మై జర్నీ: ట్రాన్‌‌సఫార్మింగ్ డ్రీమ్స్ ఇన్‌టు యాక్షన్’ పుస్తక రచయిత?
     ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
 23.    భారత తొలి అణు జలాంతర్గామి పేరు?
     ఐఎన్‌ఎస్ అరిహంత్
 24.    స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్?
     ఐఎన్‌ఎస్ విక్రాంత్
 25.    రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డును 2012-13కు ఎవరికి ప్రదానం చేశారు?
     రంజన్ సోథీ (షూటింగ్)
 26.    ఆగస్టు 2013లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ క్రీడాకారిణికి అర్జున అవార్డు లభించింది?
     పి.వి. సింధు
 27.    ఏ మళయాల రచయిత్రికి ఇటీవల సరస్వతీ సమ్మాన్‌ను ప్రదానం చేశారు?
     సుగతా కుమారి
 28.    ఆగస్టు 14, 2013న ముంబైలో మునిగి పోయిన జలాంతర్గామి?
     ఐఎన్‌ఎస్ సింధురక్షక్
 29.    2013-14లో తొలి త్రైమాసికానికి (ఏప్రిల్- జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు?
     4.4 శాతం
 30.    {పస్తుతం అమల్లో ఉన్న స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజన (ఎస్‌జేఎస్ ఆర్‌వై) స్థానంలో 12వ పంచవర్ష ప్రణాళికలో ఏ పథకాన్ని అమలు చేస్తారు?
     జాతీయ పట్టణ జీవనోపాధిమిషన్ (నేషనల్ అర్బన్ లైవ్‌లీహుడ్‌‌స మిషన్)
 31.    ఇటీవల మరణించిన రఘునాథ్ పాణిగ్రాహి ప్రముఖ?
     గాయకుడు, సంగీత దర్శకుడు
 32.    చైనాలోని గ్వాంగ్‌జూ నగరంలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించినవారు?
     పి. వి. సింధు
 33.    సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తి?
     జస్టిస్ పి. సదాశివమ్
 34.    జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ) డెరైక్టర్ జనరల్?
     శరద్ కుమార్
 35.    విదేశాంగ కార్యదర్శి ఎవరు?
     సుజాతా సింగ్
 36.    2013కు లోక్‌మాన్య తిలక్ అవార్డు ఎవరికి లభించింది?
     ఇ.శ్రీధరన్
 37.    ఇటీవల ప్రయోగించిన పృథ్వీ-2 క్షిపణి అవధి (రేంజ్) ఎంత?
     350 కి.మీ
 38.    2013కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు ఎవరికి ప్రదానం చేశారు?
     సరోద్ విద్వాంసుడు అమ్‌జద్ అలీఖాన్
 39.    సద్భావన దివస్‌ను  ఎప్పుడు నిర్వహిస్తారు?
     ఆగస్టు 20, (రాజీవ్‌గాంధీ జయంతి)
 40.    పొలిటికల్ రిపోర్టింగ్‌కు గాను ప్రేమ్ భాటియా అవార్డు ఎవరికి లభించింది?
     శాలినీ సింగ్
 41.    ఇటీవల మరణించిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ క్రికెటర్ కపిల్‌దేవ్ కోచ్?
     దేశ్‌ప్రేమ్ ఆజాద్
 42.    ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైనవారు?
     జస్టిస్ నూతలపాటి వెంకట రమణ
 43.    2013కు ఠాగూర్ సాంస్కృతిక సామరస్య పురస్కారం ఎవరికి  ప్రదానం చేశారు?
     జుబిన్ మెహతా
 44.    2012 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహు మతిని ఎల్లెన్ జాన్‌సన్ సర్‌లీఫ్‌నకు ్రపదానం చేశారు? ఈమె  ఏ  దేశాధ్యక్షురాలు?
     లైబీరియా
 45.    వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ ఇటీవల న్యూఢిల్లీలో ఏ నోబెల్ బహుమతి గ్రహీత విగ్రహావిష్కరణ చేశారు?
     డాక్టర్ నార్మన్ బోర్లాగ్
 46.    {పప్రథమ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ నెలకొల్పనున్నారు?
     రాయ్‌బరేలీ
 47.    మహిళల భద్రత, సాధికారత కోసం యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇటీవల ప్రారంభించిన పథకం?
     అహింసా మెసెంజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement