రాష్ట్రీయ అంశాలు | Rashtriya elements | Sakshi
Sakshi News home page

రాష్ట్రీయ అంశాలు

Published Tue, Jan 28 2014 10:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రాష్ట్రీయ అంశాలు - Sakshi

రాష్ట్రీయ అంశాలు

 1.    సైన్‌‌స అండ్ టెక్నాలజీ రంగంలో పద్మశ్రీ అవార్డును జనవరి 25,  2014న ఎంవైఎస్ ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన దేనికి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు?
     శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు
 2.    ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా రెండు దశాబ్దాల పాటు పనిచేసిన వ్యక్తి జనవరి 3, 2014న మరణించారు. ఆయన పేరు?
     ఎల్. వెంకట్రామ్ రెడ్డి
 3.    డిసెంబర్ 2013లో ‘తొలి తెలుగు శాసనం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక
 రచయిత?
     డాక్టర్ వేంపల్లి గంగాధర్
 4.    సినిమా రంగంలో అత్యున్నతమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని అక్కినేని నాగేశ్వరరావు ఏ సంవత్సరంలో
 అందుకున్నారు?
     1991లో
 5.    జనవరి 2014లో విజయనగరంలో ఏ కథా రచయిత శత జయంతి ఉత్సవ సభ నిర్వహించారు?
     చాసో
 6.    అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్’ పుస్తకాన్ని డిసెంబర్ 2013లో ఆవిష్కరించారు. దీని రచయిత?
     ప్రణయ్ గుప్తే
 7.    జాతీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విశ్వవిద్యాలయాన్ని రాష్ర్టంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
     హైదరాబాద్‌లో
 8.    రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏది?
     ఏరోస్పేస్ సెజ్
 9.    డిసెంబర్ 23, 2013న మాజీ రాష్ర్టపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల మగింపు వేడుకల్లో భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఈ కార్యాక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?
     అనంతపురంలో
 10.    {బిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుంచి ‘స్వోర్‌‌డ ఆఫ్ ఆనర్’ పురస్కారానికి ఎంపికైన విమానా
 శ్రయం?
     రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్ )
 11.    2013 సంవత్సరానికి తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందిన రచయిత్రి?
     కాత్యాయనీ విద్మహే
 12.    కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు డిసెంబర్ 24, 2013న ‘యార్‌‌న బ్యాంక్’(నూలు బ్యాంక్) పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?
     కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో
 13.    ‘సాహిత్యాకాశంలో సగం’ పుస్తకాన్ని
 రచించినవారు?
     కాత్యాయనీ విద్మహే
 14.    ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్‌‌జ నెట్‌వర్‌‌క్స ఏ సంస్థతో కలిసి  మే 2013లో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
     గూగుల్ ఇండియా
 15.    కొత్తగా ఏర్పాటు చేసిన భాష, సాంస్కృతిక శాఖను ఎవరికి కేటాయించారు?
     వట్టి వసంత్ కుమార్
 16.    {పాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ శైలజానాథ్‌కు డిసెంబర్ 2013లో అదనంగా  ఏ శాఖను  కేటాయించారు?
     శాసనసభ వ్యవహారాలు
 17.    కాన్‌ఫెక్షనరీ కంపెనీ ‘క్యాడ్‌బరీ’  ఏ ప్రాంత ంలో ఆసియా-పసిఫిక్‌లోకెల్లా అతిపెద్ద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనుంది?
     చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్‌లో
 18.    సుమన్ రాథోడ్ షెడ్యూల్డ్ తెగలకు చెందరని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిసెంబర్ 2013లో తీర్పునిచ్చింది. ఆమె ఏ నియోజకవర్గం నుంచి  రాష్ర్ట శాసనసభకు  ప్రాతినిధ్యం వహిస్తున్నారు?
     ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్
 నియోజకవర్గం నుంచి
 19.    2013లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఏ అకాడెమీకి లభించింది?
     పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ
 20.    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు  కోసం రాష్ర్టంలో 2006 నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వ్యయం చేశారు ?
      28,000 కోట్లు
 21.    రోష్ని పథకానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన జిల్లా?
     విశాఖపట్నం
 22.    నవంబర్ 2013లో తొమ్మిదో ప్రపంచ వ్యవసాయ సదస్సు ఎక్కడ జరిగింది?
     హైదరాబాద్‌లో
 23.    {పతిష్టాత్మకమైన ‘ఏసియన్ బిజినెస్ లీడర్‌‌స ఫోరమ్’ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును దుబాయ్‌లో డిసెంబర్ 2013లో ఎవరికి  అందజేశారు?
     అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్ర రెడ్డి
 24.    1200 కోట్ల రూపాయల వ్యయంతో పెప్సికో బేవరేజెస్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు  చేయనున్నారు ?
     చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో
 25.    ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు డిసెంబర్ 5, 2013న ప్రవేశపెట్టిన నగదు రహిత వైద్య సేవల పథకం పేరు?
     ఉద్యోగశ్రీ
 26.    పులిచింతల ప్రాజెక్టును రాష్ర్ట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 7,
 2013న గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టుకు మరో పేరు?
     కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టు
 27. కృష్ణానదిపై నిర్మించిన  పులిచింతల ప్రాజెక్టు వల్ల ఏయే జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది?
     కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు
 28.    11వ బయో ఏసియా సదస్సు 2014
     ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు ఎక్కడ జరుగుతుంది?
     హైదరాబాద్
 29.    డిసెంబర్ 2013లో ‘ఎమ్మెస్ సుబ్బులక్ష్మి యువ పురస్కార్’ను గెలుచుకున్న విద్యార్థిని ఎవరు ?
     విశాఖపట్నానికి చెందిన ఎం. ప్రత్యూష శ్రుతిరవళి
 30.    2013కు ‘పి.సుశీల అవార్డు’ను ఎవరికి ప్రదానం చేశారు?
     ప్రముఖ గాయని వాణీ జయరామ్
 31.    డిసెంబర్ 6, 2013న రాష్ర్ట ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ప్రారంభించిన భూపంపిణీ కార్యక్రమం ఎన్నోది?
     ఏడో విడత
 32.    జనవరి 6, 2013న నగదు బదిలీ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?
     తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో
 33.    రాష్ర్ట ముఖ్యమంత్రి ‘మన బియ్యం’ పథకాన్ని జనవరి 16, 2013న ఎక్కడ ప్రారంభించారు?
     హైదరాబాద్‌లోని లలిత కళా
     తోరణంలో
 34.    ఫిబ్రవరి 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సహకార బ్యాంక్(ఆప్కాబ్) చైర్మన్‌గా ఎంపికైనవారు?
     కె. వీరా రెడ్డి(మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్  చైర్మన్)
 35.    ఫిబ్రవరి 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చేనేత పారిశ్రామిక సంఘం(ఆప్కో) చైర్మన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
     మురుగుడు హనుమంతరావు
 36.    హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు ఎప్పుడు జరిగాయి?
     ఫిబ్రవరి 21, 2013
 37.    ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడెమీ పేరును మార్చి 14, 2013న ఏ పేరుగా మార్చారు?
     రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడెమీ
 38.    తపాలా ద్వారా నగదు బదిలీ పథకాన్ని మార్చి 30, 2013న (మీ డబ్బు మీ చేతికి) ఎక్కడ ప్రారంభించారు?
     చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో
 39.    మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లభించే దినసరి కూలీని తపాలా ద్వారా అందుకున్న ప్రథమ మహిళ?
     చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన మద్దూరి లక్ష్మీదేవి
 40.    ఏప్రిల్ 11, 2013న ప్రారంభించిన  ‘అమ్మహస్తం’ పథకం ద్వారా పేదలకు 9 రకాల నిత్యావసర వస్తువులను ఎన్ని రూపాయలకు అందజేస్తారు?
      185 రూపాయలు
 41.    {పధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన తొలి మహిళ వీఎస్ రమాదేవి ఏప్రిల్ 17, 2013న మరణించారు. ఆమె ఏయే రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు?
     హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక
 42.    ఏప్రిల్ 30, 2013న రాష్ర్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా మిన్ని మ్యాథ్యూ స్థానంలో ఎవరు నియమితులయ్యారు?
     ప్రసన్న కుమార్ మహంతి
 43.    రాష్ర్ట మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా మే
 2013లో ఎవర్ని నియమించారు?
     అబిద్ రసూల్ ఖాన్
 44.    మే 21, 2013న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
     జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా
 45.    రాష్ర్టంలో తొలి మహిళా పోస్టాఫీస్‌ను జూన్ 1, 2013న ఎక్కడ ప్రారంభించారు?
     విశాఖపట్నం
 46.    రాష్ర్ట మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా జూన్ 2013లో ఎవరిని నియమించారు?
     త్రిపురాన వెంకటరత్నం
 47.    జులై 11, 2013న మరణించిన ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత?
     నూకల చిన్నసత్యనారాయణ
 48.    ఆగస్టు 2013లో బెజవాడ గోపాల్‌రెడ్డి పురస్కారాన్ని నెల్లూరులో ఎవరికి ప్రదానం చేశారు?
     ప్రముఖ సామాజిక కార్యకర్త శాంతాసిన్హా
 49.    రాష్ర్ట ప్రభుత్వం 2013ను ఏ సంవత్సరంగా ప్రకటించింది?
     తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం
 50.    దుగరాజపట్నంలో మేజర్ పోర్‌‌టను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఏ జిల్లాలో ఉంది?
     నెల్లూరు జిల్లా
 51.    రాష్ర్ట డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
     బి. ప్రసాదరావు
 52.    అక్టోబర్ 2013లో ఆంధ్రప్రదేశ్‌ను అతలా
 కుతలం చేసిన తుఫాను పేరు?
     ఫైలిన్
 53.    నవంబర్ 11, 2013న రాష్ర్ట ప్రభుత్వం ఎన్నో విడత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
     మూడో విడత
 54.    నవంబర్ 14, 2013న ప్రారంభించిన పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకం పేరు?
     బాలామృతం
 55.    నవంబర్ 2013లో కేంద్ర సమాచార
 కమిషనర్‌గా రాష్ట్రానికి చెందిన ఏ వ్యక్తిని నియమించారు?
     ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
 56.    ఏప్రిల్ 2013లో దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల పర్యాటక సమావేశాలను ఏ నగరంలో నిర్వహించారు?
     హైదరాబాద్
 57.    రాష్ర్ట భద్రతా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
     రాష్ర్ట హోంమంత్రి
 58.    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీస్ సబ్
 ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌బాబుకు మరణానంతరం ఏ అవార్డు లభించింది?
     అశోక్‌చక్ర
 59.    డాక్టర్ రావూరి భరద్వాజ రాసిన ఏ నవలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు లభించింది?
     పాకుడు రాళ్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement