జనరల్ అవేర్‌నెస్
1. సచిన్ టెండూల్కర్, సీఎన్‌ఆర్ రావుకు భారతరత్న పురస్కారాన్ని ఏ రోజున ప్రదానం చేశారు?
ఫిబ్రవరి 4, 2014
2. హైదరాబాద్‌లో జరిగిన రంజీట్రోఫీ ఫైనల్‌లో మహారాష్ర్టను ఓడించి ఏడోసారి ట్రోఫీని గెలుచుకొన్న క్రికెట్ జట్టు ?
కర్ణాటక
3. ఫిబ్రవరి 2014లో మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈవో)గా ఎంపికైన వ్యక్తి?
సత్య నాదెళ్ల
4. సార్‌క దేశాల బిజినెస్ లీడర్‌స సమావేశం జనవరి 2014లో ఎక్కడ జరిగింది?
న్యూఢిల్లీ
5. 101వ సైన్‌స కాంగ్రెస్ ఫిబ్రవరి 2014లో ఎక్కడ జరిగింది?
జమ్మూలో
6. 2013 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు వ్యాస్ సమ్మాన్ ఏ హిందీ రచయితకు లభించింది?
విశ్వనాథ్ త్రిపాఠి
7. జనవరి 2014లో ప్రకటించిన పద్మ అవార్డుల్లో కీ.శే. డాక్టర్ అనుమోలు రామకృష్ణకు సైన్‌స, ఇంజినీరింగ్ విభాగంలో ఏ అవార్డు లభించింది?
పద్మభూషణ్
8. జనవరి 2014లో ఎయిర్‌పోర్‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినవారు?
అలోక్ సిన్హా
9. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఏ చిత్రానికి అత్యధికంగా ఆరు పురస్కారాలు లభించాయి?
భాగ్ మిల్కా భాగ్
10. జనవరి 2014లో డీఎస్సీ ప్రైజ్ ఏ రచయితకు లభించింది?
సైరస్ మిస్త్రీ
11. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం) ను జనవరి 20, 2014న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఎక్కడ ప్రారంభించారు?
బెంగళూరులో
12. {పస్తుత రివర్‌స రెపోరేట్ ఎంత?
7 శాతం
13. భారతదేశంలో భూమిలేని పేదలే లేని తొలి జిల్లా ఏది? (నవంబర్ 1, 2013న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు)
కేరళలోని కన్నూర్ జిల్లా
14. 44వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నవంబర్ 20, 2013న ఎక్కడ ప్రారంభమయ్యాయి?
గోవాలోని పనాజీలో
15. లైంగిక వేధింపుల ఆరోపణలపై నవంబర్ 2013లో తెహెల్కా మ్యాగజీన్ వ్యవస్థాపకున్ని అరెస్ట్ చేశారు. ఆయన పేరు?
తరుణ్ తేజ్‌పాల్
16. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఎవరు చేపట్టిన నిరాహార దీక్షకు నవంబర్ 4, 2013 నాటికి 13 ఏళ్లు పూర్తయ్యాయి?
మణిపూర్ మహిళ ఇరోమ్ షర్మిలా చాను
17. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు నవంబర్ 9, 2013న స్టే విధించింది?
గౌహతి హైకోర్టు
18. {పపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని మనదేశంలో ఎక్కడ నిర్మించనున్నారు?
బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో
19. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్‌స ఆఫ్ కామర్‌స అండ్ ఇండస్ట్రీ అధ్యక్షునిగా నవంబర్ 2013లో ఎవరు ఎంపికయ్యారు?
సిద్దార్‌థ బిర్లా
20. నవంబర్ 2013లో ముంబైలో జరిగిన సీఐఐ జాతీయ మండలి సమావేశంలో సీఐఐ ప్రెసిడెంట్స్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
టాటాగ్రూప్ మాజీ చైర్మన్ రతన్‌టాటా
21. 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలు నవంబర్ 2013లో ఎక్కడ జరిగాయి?
హైదరాబాద్‌లో
22. కొత్త ప్రైవేట్ బ్యాంకు లెసైన్సుల దరఖాస్తులను పరిశీలించడానికి భారతీయ రిజర్‌వ బ్యాంక్ ఏర్పాటు చేసిన సంఘానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్
23. జపాన్‌లోని కకమిగహరలో నవంబర్
2013లో జరిగిన మహిళల ఆసియన్ ఛాంపియన్‌స ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టుకు ఏ పతకం లభించింది?
రజత పతకం(జపాన్‌కు స్వర్ణ పతకం లభించింది)
24. ఒకరోజు అంతర్జాతీయ పోటీల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి ఎవరి పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు?
వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్‌డ్స
25. మల్టీ బ్రాండ్ రీటెయిల్ రంగంలోకి ప్రవేశించిన టెస్కో ఏ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీ?
బ్రిటన్
26. వీసా కేసులో అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేసిన భారత దౌత్యవేత్త పేరు?
దేవయాని ఖోబ్రగడే
27. నవంబర్ 2013లో భారత పర్యటనకు వచ్చిన జపాన్ చక్రవర్తి పేరు?
అకిహిటో
28. 44వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బంగారు నెమలిని దక్కించుకున్న ఉత్తమ చిత్రం?
తూర్పు తైమూర్ దేశానికి చెందిన బీట్రిజ్ వార్
29. నవంబర్ 2013లో తొలి సెంటెనరీ అవార్డును ఏ ప్రముఖ నటికి ప్రదానం చేశారు?
వహీదా రెహమాన్
30. భారతరత్న లభించిన ముగ్గురు శాస్త్రవేత్తలు?
సర్ సివి. రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, సీఎన్‌ఆర్ రావు
31. చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌లో సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు?
సీఎన్‌ఆర్. రావు
32. అక్టోబర్ 30, 2013న సియోల్‌లో జరిగిన మిస్ ఆసియా పసిఫిక్ వరల్డ్-2013 పో టీల్లో విజేతగా నిలిచిన భారతీయ వనిత?
సృష్టి రాణా
33. నవంబర్ 2013లో ఫార్చ్యూన్ మ్యాగజీన్ భారత వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా మూ డోసారి అగ్రస్థానం దక్కించుకున్నవారు?
ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచ్చర్
34. డిసెంబర్ 27, 2013న మరణించిన ఫరూక్ షేక్ ఎవరు?
బాలీవుడ్ ప్రముఖ నటుడు
35. విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా జనవరి 1, 2014 నుంచి ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
పి. మధుసూదన్
36. {బిటన్ రెండో అత్యున్నత పురస్కారం డేమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ (డీబీఈ) ఇటీవల భారత సంతతికి చెందిన ఏ విద్యావేత్తకు లభించింది?
ఆశా ఖేమ్కాకు
37. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం ఏ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వం జనవరి 2014లో రద్దు చేసింది?
ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్
38. జనవరి 2014లో భారత అండర్ -19 క్రికెట్ జట్టు ఏ దేశాన్ని ఓడించి ఆసియా కప్‌ను గెలుచుకొంది?
పాకిస్థాన్
39. భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్
ఎవరు?
విజయ్ జోల్
40. జనవరి 2014లో చెన్నై ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్నవారు?
స్విట్జర్లాండ్‌కు చెందిన స్టానిస్లాస్ వావ్రింకా
41. జనవరి 2014లో పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు?
అశోక్ కుమార్ గంగూలీ
42. జనవరి 1, 2014 నాటికి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమై ఎన్నేళ్లు పూర్తయ్యాయి?
వందేళ్లు
43. పురుషుల జూనియర్ బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచిన మధ్య ప్రదేశ్ క్రీడాకారుడు?
ఆదిత్య జోషి
44. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసిన లాక్టాలిస్ కంపెనీ ఏ దేశానికి చెందినది?
ఫ్రాన్స్
45. నచికేత్ మోర్ కమిటీ ఎప్పటివరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఖాతా అందుబాటులో ఉండాలని సిఫార్సు చేసింది?
2016, జనవరి 1
46. 75వ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియ న్‌షిప్ పోటీల్లో పురుషుల విజేత?
సనీల్ షెట్టి
47. జవనరి 2014లో పాట్నాలో జరిగిన జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మహిళల విభాగంలో టైటిల్‌ను ఎవరు సాధించారు?
అంకితా దాస్
48. {పపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్ల్లాట్‌ఫామ్?
ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్
49. జనవరి 2014లో ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్న మహాత్మాగాంధీ మనుమరాలు?
ఇలా గాంధీ
50. నేషన్‌స కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారిణి ఎవరు?
నిఖిత్ జరీన్
51. ఆసియాలోకెల్లా అతిపెద్ద వార్షిక సాహితీ ఉ త్సవం జనవరి 2014లో ఎక్కడ జరిగింది?
జైపూర్
52. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి తొలి మహిళా డెరైక్టర్‌గా జనవరి 2014లో ఎవరిని నియమించారు?
అరుణా బహుగుణ
53. జనవరి 17, 2014న కోల్‌కతాలో మరణించిన ప్రముఖ బెంగాలీ, హిందీ సినీ నటి ఎవరు?
సుచిత్రాసేన్
54. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని జనవరి 2014లో ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించారు. ఈ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు?
4 వేల కిలోమీటర్లు
55. జనవరి 2014లో కేంద్ర కేబినెట్ ఎవరికి మైనారిటీ హోదా కల్పించింది?
జైనులకు
56. జనవరి 2014లో హాకీ వరల్డ్ లీగ్ పోటీలను ఏ నగరంలో నిర్వహించారు?
న్యూఢిల్లీలో
57. న్యూఢిల్లీలో 2014 జనవరిలో జరిగిన పార్శ్వనాథ్ గ్రాండ్ మాస్టర్‌స ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న భారత క్రీడాకారుడు?
అభిజిత్ గుప్తా
58. 2005 మొనాకో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో లాంగ్‌జంప్‌లో ఎనిమిదేళ్ల తర్వాత భారతదేశానికి చెందిన ఏ క్రీడాకారిణికి ఇటీవల స్వర్ణ పతకం ప్రకటించారు?
అంజూ బాబి జార్జి
59. 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనవారు?
జపాన్ ప్రధానమంత్రి షింజో అబే
60. జనవరి 2014లో లక్నోలో జరిగిన సయ్యద్‌మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నవారు?
సైనా నెహ్వాల్
61. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో జీవిత సాఫల్య అవార్డు ఎవరికి లభించింది?
తనూజ
62. అక్టోబరు 26, 2013న హృదయనాథ్ మంగేష్కర్ అవార్డును ముంబైలో ఎవరికి ప్రదానం చేశారు?
అమితాబ్ బచ్చన్‌కు
63. అక్టోబరు, 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ ఫ్రాంచైజీని బీసీసీఐ రద్దు చేసింది?
పుణే వారియర్‌స
64. యశ్‌చోప్రా స్మారక తొలి పురస్కారాన్ని అ క్టోబరు 2013లో ఎవరికి ప్రదానం చేశారు?
ప్రముఖ గాయని లతా మంగేష్కర్