డిజిటల్ ఇండియా లక్ష్యాలు?
ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పేపర్–4 మోడల్ ప్రశ్నలు
సెక్షన్–1
1. ఎమర్జింగ్ టెక్నాలజీలు అంటే ఏమిటి? వాటి లక్షణాలేవి? సమకాలీన ఎమర్జింగ్ టెక్నాలజీల గురించి రాయండి.
2. మన దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సైన్స్, టెక్నాలజీ పాత్రను వివరించండి. (లేదా) జాతి నిర్మాణంలో సైన్స్, టెక్నాలజీ పాత్రపై చర్చించండి.
3. 2013 నాటి సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ విధాన ముఖ్యాంశాలపై చర్చించండి.
4. డిజిటల్ ఇండియా లక్ష్యాలను, సాధించిన ప్రగతిని వివరించండి.
5. భారత అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్‌ఎల్‌వీ పాత్ర ఏమిటి?
6. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో అంతరిక్ష కార్యక్రమం ఉపయోగాలేవి?
7. దేశంలో సౌర శక్తి అభివృద్ధి గురించి క్లుప్తంగా వ్యాసం రాయండి.
8. 1) జియో థర్మల్ ఎనర్జీ
2) సముద్ర శక్తి రకాలు 3) వేస్ట్ టు పవర్
9. దేశంలో శీతోష్ణస్థితి మార్పు నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి రాయండి.
10. వరదలకు కారణాలు, నిర్వహణ చర్యలు గురించి రాయండి.
సెక్షన్–2
11. ఎ) అకశేరుకాలు–సకశేరుకాలు మధ్య భేదాలు.
బి) వైరస్‌ల వర్గీకరణ.
12. ఎ) అమైనో ఆమ్లాలు, కర్బన ఆమ్లాల మధ్య భేదాలేవి?
బి) ఆల్కహాల్స్, యాంటీబయాటిక్స్ ఉపయోగాలేవి?
13. ఎ) వ్యవసాయ ఆవిర్భావ కారణాలు
బి) వావిలావ్ వ్యవసాయ ఆవిర్భావ కేంద్రాలు
14. వైద్య రంగంలో జంతువుల పాత్ర గురించి వివరించండి.
15. 1) ఎబోలా జ్వరం 2) జికా జ్వరం
3) పచ్చ జ్వరం
16. మలేరియా రోగోత్పత్తి, నిర్ధారణ, చికిత్స, నివారణ చర్యల గురించి రాయండి.
17. ఎ) జన్యు ఇంజనీరింగ్ సాధారణ ప్రక్రియ.
బి) డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్.
18. వ్యవసాయంలో జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారకాల పాత్ర ఏమిటి?
19. ఎ) మిషన్ ఇంద్రధనుస్సు
బి) పల్స్ పోలియో కార్యక్రమం
20. టీకాలు వేసే ముందు, వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించండి.
సెక్షన్–3
21. ఎ) ఆహార శృంఖలం అంటే ఏమిటి? అందులోని రకాలను ఉదాహరణలతో రాయండి.
బి) ఆహార శృంఖలాల ప్రాధాన్యతను తెలపండి?
22. ఎ) జీవ వైవిధ్య హాట్‌స్పాట్స్ అంటే ఏమిటి? వీటిని గుర్తించే ప్రమాణాలేవి?
బి) భారత్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ గురించి రాయండి.
23. ఎ) భారత్‌లో అక్రమ మైనింగ్ గురించి రాయండి.
బి) మైన్స్ అండ్ మినరల్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం–ఇటీవలి సవరణల గురించి రాయండి.
24. ఎ) ప్రధానమంత్రి కృషి సించాయి యోజన.
బి) నమామి గంగే కార్యక్రమం.
25. ఎ) ఓషన్ అసిడిఫికేషన్.
బి) పార్టికులేట్ మ్యాటర్ కాలుష్యం.
26. ఎ) సముద్ర కాలుష్యం.
బి) భార లోహాల కాలుష్యం.
- సి.హరికృష్ణ
డైరెక్టర్, విన్–విన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్