దేశంలో నాణ్యవంతమైన పాఠశాల విద్యను అందించడంలో ఎన్‌సీఈఆర్‌టీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇది పదో తరగతి చదువుతున్న ప్రతిభావంతులను గుర్తించి, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఉపకారవేతనాలను అందించేందుకు ఏటా జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు, పరీక్ష విధానం, పరీక్షకు సన్నద్ధత, ఉపకారవేతనాల తీరుతెన్నులపై ఫోకస్...
అర్హత: ప్రస్తుతం రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విద్యార్థులు కూడా అర్హులు. ఎంపిక ప్రక్రియ: ఇది రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్-1 రాత పరీక్షను విద్యార్థి చదువుతున్న పాఠశాల ఉన్న రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన వారు జాతీయ స్థాయిలో నిర్వహించే స్టేజ్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు నేరుగా రెండో దశ పరీక్ష రాసేందుకు అర్హులు. రెండో దశ పరీక్షకు విద్యార్థులను అర్హులను చేసేందుకు ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక కోటా ఉంటుంది. తుది దశ పరీక్ష పూర్తయిన తర్వాత, స్కాలర్‌షిప్ అర్హుల ఎంపికకు మాత్రం ఎలాంటి కోటా ఉండదు.
తొలి దశ పరీక్ష:
తొలిదశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలుంటాయి. అవి.. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (ఎంఏటీ); లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్; స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాష్ట్రంలో పరీక్షను ఇంగ్లిష్/ హిందీ/ తెలుగు/ ఉర్దూ మాధ్యమంలో రాయవచ్చు.
విభాగం మార్కులు
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50
లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్ 40
ఆప్టిట్యూడ్ టెస్ట్ 90
లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్‌కు సంబంధించి అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ విభాగం అర్హత విభాగం మాత్రమే. ఇందులోని మార్కులు మెరిట్ జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకోరు.
రెండో దశ పరీక్ష:
పేపర్ {పశ్నలు సమయం
మెంటల్ ఎబిలిటీ 50 45 ని.
లాంగ్వేజ్ టెస్ట్ (ఇంగ్లిష్/హిందీ) 50 45 ని.
స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 100 90 ని.
తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులు ఉంటాయి.
ఉపకారవేతనం- అందే విధానం:
జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష ద్వారా వెయ్యి మంది ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు.
ఎంపికైన వారికి ఇంటర్మీడియెట్ రెండేళ్లలో నెలకు రూ. 1,250 అందజేస్తారు. అండర్‌గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు నెలకు రూ.2,000 ఇస్తారు.
పీహెచ్‌డీలో చేరితే యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉపకారవేతనం మొత్తాన్ని నిర్ధరిస్తారు.
రిజర్వేషన్:
కేటగిరీ స్కాలర్‌షిప్‌ల్లో రిజర్వేషన్
ఎస్సీ 15 శాతం
ఎస్టీ 7.5 శాతం
ఫిజికల్లీ చాలెంజ్డ్ 3 శాతం
ముఖ్య తేదీలు:
మొదటి దశ పరీక్ష: నవంబరు 8, 2015.
రెండో దశ పరీక్ష: మే 8, 2016.
దరఖాస్తు విధానం:
రాష్ట్రస్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి రాష్ట్రాల వారీగా ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. వీటి ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో ఎన్‌టీఎస్‌ఈ వివరాలను డెరైక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.
ప్రిపరేషన్ ఎలా?
మెంటల్ ఎబిలిటీ టెస్ట్:జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో విద్యార్థులు ప్రధానంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యం.. విశ్లేషణాత్మక ఆలోచన. విజ్ఞానం సముపార్జించి, పరీక్షలో విజయం సాధించేందుకు ఇదే ఉత్తమ సాధనం. రేషియో-ప్రొపోర్షన్స్-యావరేజెస్; ప్రాఫిట్ అండ్ లాస్; టైమ్ అండ్ డిస్టెన్స్; ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్; సింపుల్ ఇంట్రస్ట్; సెట్స్-వెన్ డయాగ్రమ్స్ తదితర అంశాలతో పాటు ఆైఈకఅ ఆధారిత ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ఈ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఈ విభాగాలపై పట్టు సాధించాలంటే ప్రాక్టీస్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
వెర్బల్ రీజనింగ్‌కు సంబంధించి బ్లడ్ రిలేషన్స్; సిరీస్; వర్డ్ రిలేషన్‌షిప్; కోడింగ్-డీకోడింగ్; డెరైక్షన్స్; కేలండర్ తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. నాన్ వెర్బల్ రీజనింగ్‌లో మిర్రర్ ఇమేజస్;ఫిగర్ మ్యాట్రిక్స్; అనాలజీ; పేప ర్ ఫోల్డింగ్ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి.మొత్తం ప్రశ్నల్లో దాదాపు 10 నాన్ వెర్బల్, 15 వరకు వెర్బల్ రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. పటాల ఆధారిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. తేలికపాటి డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి పూర్తిస్థాయిలో స్కోర్ సాధించేందుకు ఇవి ఉపయోగపడతాయి.
స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్:
ఇందులో సోషల్ సెన్సైస్; సెన్సైస్; మ్యాథమెటిక్స్‌లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. గత పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి, సబ్జెక్టుల వారీగా ముఖ్యమైన అంశాలను గుర్తించి, వాటిని క్షుణ్నంగా చదవాలి. సబ్జెక్టుల్లోని ముఖ్యమైన భావనలను నోట్సులో రాసుకొని, వాటిని వీలున్నప్పుడు పునశ్చరణ చేయాలి. సోషల్ సెన్సైస్‌కు సంబంధించి జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ అంశాలను ప్రాధాన్య క్రమంలో అధ్యయనం చేయాలి.
ఎన్‌టీఎస్‌ఈ...ప్రతిభకు ‘ఉపకారం’!
Published Thu, Aug 27 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM
Advertisement
Advertisement