బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్‌ను ఆఫర్ చేస్తున్న ఐఐటీలేవి?
పీజీలో జెనెటిక్స్ కోర్సును అందిస్తున్న వర్సిటీలేవి?
-స్వామి, మహబూబ్‌నగర్.
జీవుల్లో జన్యువులకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసే శాస్త్రమే జెనెటిక్స్ (జన్యుశాస్త్రం). ఇందులో హ్యుమన్ జెనెటిక్స్, మాలిక్యులర్ జెనెటిక్స్, మెడికల్ జెనెటిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. హెల్త్‌కేర్, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీకేర్ వంటి రంగాల్లో ఈ శాస్త్ర అనువర్తనాలను వినియోగిస్తారు. ఈ కోర్సు పూర్తి చే సిన వారికి అగ్రికల్చర్, ఫార్మాస్యుటికల్, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ పరిశ్రమల్లో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని పరిశోధనశాలల్లో
ఆర్ అండ్ డీ విభాగాల్లో స్థిర పడొచ్చు.
ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
{పవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
{పవేశం: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
బ్యాచిలర్ స్థాయిలో డిజైనింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
-సత్యం, నిజామాబాద్.
డిజైన్ కోర్సులో మొదట డిజైనింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. తర్వాత డిజైనింగ్ అంటే ఏమిటి? ఈ ప్రక్రియలో ఏయే రంగులు వాడాలి? 3డి డిజైనింగ్, డిజిటల్ మెథడ్స్, స్పెస్ అండ్ స్ట్రక్చర్, డిజైన్ డ్రాయింగ్, జామెట్రీ వంటి అంశాలను బోధిస్తారు. టెక్నాలజీ, ప్రొడక్ట్, గ్రాఫిక్స్, టెక్నిక్స్, ఎలాంటి మెటీరియల్‌ను వాడాలి? మార్కెట్ ట్రెండ్‌ను అంచనా వేయడం వంటి అనేక అంశాల గురించి ఈ కోర్సులో వివరిస్తారు. డిజైనింగ్ కోర్సులు చేసిన వారికి మారుతీ సుజుకీ, రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్, ఎల్‌జీ, వర్‌లపూల్, గోద్రేజ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, జీఈ హెల్త్‌కేర్, ఐబీఎమ్, సినర్జీ లైఫ్ స్టైల్స్, టాటా మోటార్‌స వంటి అనేక జాతీయ, బహుళజాతి కంపెనీలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. డిజైనర్లకు విదేశాల్లో కూడా చక్కని అవకాశాలు లభిస్తున్నాయి.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతి
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్
ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా
వెబ్‌సైట్: www.iitg.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్
కోర్సు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజైన్ (స్పెషలైజేషన్స్-యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్). దీంతోపాటు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజైన్ కోర్సును కూడా ఆఫర్ చేస్తుంది. ఇందులో 18 రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి.
అర్హత: 10+2/తత్సమానం
వ్యవధి: నాలుగేళ్లు
{పవేశం: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష ద్వారా
వెబ్‌సైట్: ఠీఠీఠీ.జీఛీ.్ఛఛీఠ
ఎంఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి?
-శ్రీధర్, నిర్మల్.ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి.
ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
బీటెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలేవి?-సురేష్, హైదరాబాద్.
భూగర్భంలో ఉన్న ఖనిజాలను గుర్తించడం, వాటిని వెలికితీయడం,సమర్థంగా వినియోగించడం సంబంధిత విధానాలు, పద్ధతుల గురించి మైనింగ్ ఇంజనీరింగ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో మైన్ ప్లానింగ్, మైన్ ఎన్విరాన్‌మెంట్, సర్ఫేస్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ రీసెర్చ్, మైన్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర సబ్జెక్ట్‌లు ఉంటాయి. బీటెక్(మైనింగ్) కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు మైనింగ్ ఇంజనీర్, మైన్ ప్లానర్, కోల్ ప్రిపరేషన్ ప్లాంట్ మేనేజర్, మైన్ సేఫ్టీ అండ్ హెల్త్ స్పెషలిస్టు, ప్రాసెస్ ప్లాంట్ మెయింటెనెన్స్ ఫోర్‌మన్, ఎక్స్‌ట్రాక్షన్ మెయింటెనెన్స్ సూపరింటెండెంట్ తదితర హోదాల్లో స్థిరపడొచ్చు.
ఆఫర్ చేస్తున్న ఐఐటీలు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్
ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా
వెబ్‌సైట్: www.iit-kgp.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-వారణాసి
ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా
వెబ్‌సైట్: www.iit-bhu.ac.in
వీటితోపాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్ (ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-సూరత్‌కల్ (ప్రవేశం: జేఈఈ-మెయిన్ ఆధారంగా వెబ్‌సైట్: www.nitk.ac.in) కూడా బీటెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
స్కాలర్‌షిప్స్
ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ స్కాలర్‌షిప్స్
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ) పీజీస్థాయిలో ప్రొఫెషనల్, సాంకేతిక కోర్సులు చదువుతున్న అంగవైకల్యం గల విద్యార్థులకు అందజేసే ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు..
స్కాలర్‌షిప్ స్కీమ్ (ట్రస్ట్ ఫండ్):
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 2,000
కాల వ్యవధి: 10 నెలలు
అర్హత: ప్రొఫెషనల్ డిగ్రీ/పీజీ చదువుతూ ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 3లక్షలకు మించకూడదు.స్కాలర్‌షిప్ మొత్తం: ప్రొఫెషనల్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 2,500, ప్రొఫెషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులకు నెలకు రూ. 3,000 చెల్లిస్తారు. అంతేకాకుండా కంటిన్‌జెన్సీ ఫండ్ కింద డిగ్రీ విద్యార్థులకు రూ. 6,000, పీజీ విద్యార్థులకు రూ. 10,000 అదనంగా అందజేస్తారు.
స్కాలర్‌షిప్ స్కీమ్ (నేషనల్ ఫండ్)
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 500
కాల వ్యవధి: 10 నెలలు
అర్హత: ప్రొఫెషనల్ డిగ్రీ/పీజీ చదువుతూ ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.80 లక్షలలోపు ఉండాలి.
స్కాలర్‌షిప్ మొత్తం: ప్రొఫెషనల్ డిగ్రీ లేదా పీజీ చదువుతున్న హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ. 1,000 డేస్కాలర్స్‌కు రూ. 700, డిప్లొమా/సర్టిఫికెట్ స్థాయి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులను నెలకు రూ. 400 చెల్లిస్తారు. కంటిన్‌జెన్సీ ఫండ్ కింద రూ.10,000 అదనంగా అందజేస్తారు. అంతేకాకుండా ప్రొఫెషనల్ పీజీ/డీగ్రీ చదువుతున్న డెఫ్/బ్లైండ్ విద్యార్థులకు కంప్యూటర్ కోసం ఆర్థిక సహాయాన్ని ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తును ప్రింట్ తీసి నిర్దేశిత చిరునామాకు పంపాలి.దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2014.
వివరాలకు: www.nhfdc.nic.in
జి.పి. బిర్లా ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్
జి.పి. బిర్లా ఫౌండేషన్-కోల్‌కతా, 2014-15 విద్యా సంవత్సరానికి అందజేసే యూజీ స్కాలర్‌షిప్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు..
ఎవరి కోసం: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్, హ్యూమానిటీస్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, కామర్స్, లా కోర్సులు చదువుతున్న విద్యార్థులు.స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లిస్తారు. ఏడాది ఒక సారి స్కాలర్‌షిప్ చెల్లిస్తారు. ప్రతిభ ఆధారంగా తర్వాతి సంవత్సరానికి పొడిగిస్తారు.
అర్హత: 2014లో 12వ తరగతిలో స్టేట్ బోర్డ్ అయితే 80 శాతం లేదా సెంట్రల్ బోర్డ్ అయితే 85 శాతంతో ఉత్తీర్ణత లేదా జేఈఈ/ఏఐపీఎంటీ వంటి ప్రవేశ పరీక్షల్లో 15 వేల లోపు ర్యాంక్ సాధించి ఉండాలి.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 31, 2014.
వివరాలకు: http://gpbirlaedufoundation.com
రోడ్స్ స్కాలర్‌షిప్స్
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించాలనుకునే వారికి ఉద్దేశించింది. ఎంపికైన వారికి కనీసం రెండేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ సదు పాయం లభిస్తుంది.
ఒక ఏడాది వ్యవధి గల మాస్టర్స్ కోర్సులో ప్రవేశం పొంది స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారు.. కోర్సు వ్యవధి ముగిశాక మరో కోర్సులో ప్రవేశించాక కూడా స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఎంపికైన వారికి ట్యూషన్‌ఫీజు, విమాన ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లిస్తారు. ఎంపిక విధానం: ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ లో రీజనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీని ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఢిల్లీలో నిర్వహించే ఫైనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక సమ యంలో అభ్యర్థుల్లోని స్కిల్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తారు.అర్హులు: భారతీయ పౌరులై అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రథమ శ్రేణిమార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 31, 2014.
వెబ్‌సైట్: www.rhodesscholarshipsindia.com
సాహుజైన్ ట్రస్ట్ స్కాలర్‌షిప్స్
సాహుజైన్ ట్రస్ట్(సామాజిక సేవా సంస్థ) పలు అంశాల్లో అందజేసే నీడ్-కమ్-మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆఫర్ చేస్తున్న విభాగాలు: ఇంజనీరింగ్, ఇన్ఫోటెక్, మెడికల్, ఎంబీఏ వంటి టెక్నికల్ కోర్సులు.స్కాలర్‌షిప్ మొత్తం: నెలకు రూ.150 - 1,000 వరకు.దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకో వచ్చు. లేదా ది, సెక్రట రీ, సాహు జైన్ ట్రస్ట్, 18, ఇండ స్ట్రియల్ ఏరియా, లోధిరోడ్, న్యూఢిల్లీ-110003 నుంచి 9 ్ఠ 4 సైజు గల కవరు (దీనిపై రూ.45 విలువగల స్టాంపులను అతికించాలి)ను పంపి పోస్ట్ ద్వారా కూడా దరఖాస్తును పొందొచ్చు.
పోస్ట్ ద్వారా దరఖాస్తుల కోసం చివరి తేదీ:
జులై 20, 2014.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జులై 30, 2014.
వెబ్‌సైట్:
జ్ట్టిఞ://sahujaintrust.timesofindia.com/