బులెటిన్ బో్ర్డ్ | Retired employees of the consultant posts | Sakshi
Sakshi News home page

బులెటిన్ బో్ర్డ్

Published Mon, Aug 22 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

బులెటిన్ బో్ర్డ్

బులెటిన్ బో్ర్డ్

రిటైర్డ్ ఉద్యోగులకు కన్సల్టెంట్ పోస్టులు
 కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్వయంప్రతిపత్తి సంస్థలు, బ్యాంకులు తదితర సంస్థల్లో ఉద్యోగం చేసి ఇటీవల పదవీ విరమణ పొందినవారిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్లుగా నియమించేందుకు కేంద్ర సమాచార సంఘం (సీఐసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అర్హత: అండర్ సెక్రెటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ప్రొటోకాల్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, పీపీఎస్, పీఎస్, పీఏలుగా రిటైరైనవారు మాత్రమే అర్హులు.
 
 అనుభవం: పైన పేర్కొన్న ప్రభుత్వ సంస్థల్లోని సాధారణ పరిపాలనకు సంబంధించిన అనుభవంతోపాటు కంప్యూటర్‌పై పనిచేయగల నేర్పు ఉండాలి. సమాచార హక్కు వ్యవహారాల్లో అనుభవాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తారు. ఇటీవల పదవీ విరమణ పొందినవారికి ప్రాధాన్యత ఇస్తారు.
 వేతనం: చివరిసారిగా అందుకున్న వేతనం మైనస్ పెన్షన్ ప్లస్ డీఏ (లేదా) అభ్యర్థి అనుభవాన్ని బట్టి సీఐసీ నిర్ణయిస్తుంది.
 
 కాంట్రాక్ట్ వ్యవధి: తొలుత ఆరు నెలల కాల వ్యవధికి నియమిస్తారు. తర్వాత సంస్థ అవసరం, అభ్యర్థి పనితీరును బట్టి పొడిగించే అవకాశం ఉంది.
 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపాలి.
 చిరునామా: సుశీల్ కుమార్, డిప్యూటీ సెక్రెటరీ (అడ్మిన్), సీఐసీ, సెకండ్ ఫ్లోర్, ‘బి’ వింగ్, అగస్త్య క్రాంతి భవన్, భికాజి కామా ప్లేస్, న్యూఢిల్లీ, 110066.
 
 చివరి తేది: ఆగస్టు 26
 వివరాలకు: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (2016 ఆగస్టు 6-12 సంచిక) చూడొచ్చు.
 
  జాకీర్ హుస్సేన్ స్కూల్‌లో 21 టీచింగ్ పోస్టులు
 ఢిల్లీలోని జఫ్రాబాద్ ప్రాంతంలో గల డాక్టర్ జాకీర్ హుస్సేన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో (ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో) టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
 
 మొత్తం పోస్టులు: 21
 పోస్టుల వారీ ఖాళీలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) ఉర్దూ-1, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) ఇంగ్లిష్-2, టీజీటీ మ్యాథ్స్-3, టీజీటీ హిందీ-1, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)-2, టీజీటీ డొమెస్టిక్ సైన్స్-1, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్-1, అసిస్టెంట్ టీచర్-8, అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)-1, లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)-1.
 
 వేతనం: టీచర్స్‌కి రూ.9300-34,800+గ్రేడ్ పే; యూడీసీ, ఎల్‌డీసీలకు రూ.5,200- 20,200.
 విద్యార్హత: పీజీటీకి ఎంఏ, బీఈడీ; టీజీటీలకు కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈడీ; టీజీటీ(డొమెస్టిక్ సైన్స్) పోస్టుకు హోమ్ సైన్స్‌లో డిప్లొమా/బీఎస్సీతోపాటు ట్రైనింగ్/ఎడ్యుకేషన్‌లో డిగ్రీ/డిప్లొమా; పీఈటీకి గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫిజికల్ ట్రైనింగ్‌లో డిప్లొమా/బీపీఈడీ; స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌కి గ్రాడ్యుయేషన్‌తోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ; అసిస్టెంట్ టీచర్‌కి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత; యూడీసీకి గ్రాడ్యుయేషన్; ఎల్‌డీసీకి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు నిమిషానికి 30 పదాలను టైపింగ్ చేయగలగాలి.
 
 గమనిక: టీచర్ పోస్టులకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ) ఉత్తీర్ణులే దరఖాస్తు చేయాలి. అన్ని పోస్టులకు సెకండరీ లెవల్/తత్సమాన స్థాయి వరకు ఉర్దూ కోర్స్-ఏ ఉత్తీర్ణత తప్పనిసరి.
 
 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులకు అటెస్ట్ చేసిన విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి స్కూల్ మేనేజర్‌కు పోస్ట్‌లో పంపాలి
 చివరి తేది: ఆగస్టు 27
 వివరాలకు: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (2016 ఆగస్టు 6-12 సంచిక) చూడొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement