ఎన్. విజయేందర్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ పథకాలు
1. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో ఉన్న రెండు విభాగాల పేర్లు?
డిపార్‌టమెంట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్‌టమెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్‌స
2. తాగునీరు, పారిశుధ్య విభాగం గతంలో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసింది?
గ్రామీణాభివృద్ధి శాఖ
3. {పస్తుత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు?
జైరామ్ రమేష్
4. తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న కేంద్ర సహాయమంత్రి
(స్వతంత్ర హోదా)?
భరత్‌సింహ్ సోలంకీ
5. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖకు ఉన్న ఇద్దరు సహాయ మంత్రుల పేర్లు?
{పదీప్ జైన్,
లాల్‌చంద్ కటారియా
6. {పజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సమాజాభివృద్ధి పథకం (కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)ను ఎప్పుడు ప్రారంభించారు?
1952
7. జాతీయ విస్తరణ సేవా పథకం (నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్)ను ఎప్పుడు ప్రారంభించారు?
1953
8. 1960లో ప్రారంభించిన ఏ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు సరఫరా చేసింది?
సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం (ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)
9. ప్రత్యేక పంటల కోసం సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం (ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్)ను ఎప్పుడు ప్రారంభించారు?
1964
10. అధిక దిగుబడినిచ్చే రకాల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1966-67
11. 1966లో ప్రారంభమైన హరిత విప్లవం దేనికి సంబంధించింది?
ఆహార ధాన్యాల ఉత్పత్తి
12. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు?
ఎం.ఎస్. స్వామినాథన్
13. గ్రామీణాభివృద్ధి కోసం 14 బ్యాంకులను జాతీయకరణ చేసిన తేదీ?
జూలై 19, 1969
14. మొదటి దశలో 14 బ్యాంకులను జాతీయకరణం చేసిన ప్రధానమంత్రి?
ఇందిరాగాంధీ
15. ఉపాధి హామీ పథకాన్ని 1972-73లో ఏ రాష్ర్టంలో ప్రారంభించారు?
మహారాష్ర్ట
16. 1972-73లో గ్రామాల్లో తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
ైైసత్వర గ్రామీణ తాగునీటి పథకం (ఆక్సిలిరేటెడ్ రూరల్ వాటర్ సప్లయ్ ప్రోగ్రామ్)
17. కరువు ప్రాంతాల్లో పంటల అభివృద్ధి కోసం 1973లో ప్రారంభించిన పథకం?
కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం (డ్రాఫ్ట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్)
18. ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల సహాయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1973-74
19. చిన్నరైతుల కోసం సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించే ఏ పథకాన్ని 1974-75లో ప్రవేశపెట్టారు?
చిన్నసన్నకారు రైతుల అభివృద్ధి వ్యవస్ధ (స్మాల్ ఫార్మర్‌స డెవలప్‌మెంట్ ఏజెన్సీ)
20. చిన్న, బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం కోసం 1974-75లో ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు?
కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (సీఏడీపీ)
21. 1975లో పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించిన పథకం?
20 సూత్రాల కార్యక్రమం
22. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ను ఎప్పుడు స్థాపించారు?
1977
23. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఏ నగరంలో ఉంది?
హైదరాబాద్
24. 1977-78లో ఎడారుల విస్తరణను నియంత్రించడానికి ప్రారంభించిన పథకం?
ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమం (డిసర్‌ట డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)
25. 1977-78లో అంత్యోదయ యోజనను ఏ రాష్ర్టంలో ప్రారంభించారు?
రాజస్థాన్
26. అంత్యోదయ యోజన ముఖ్య ఉద్దేశం?
పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం
27. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి శిక్షణనిచ్చే ట్రైజమ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఆగస్ట్ 15, 1979
28. 1999లో ట్రైజమ్ పథకాన్ని ఏ పథకంలో విలీనం చేశారు?
స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన
29. రెండోదశలో బ్యాంకులను జాతీయకరించిన తేదీ?
ఏప్రిల్ 15, 1980
30. రెండో దశలో ఎన్ని ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరణం చేశారు?
ఆరు
31. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య?
19
32. సెప్టెంబర్ 1993లో న్యూబ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకులో విలీనమైంది?
పంజాబ్ నేషనల్ బ్యాంక్
33. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)ను ఎప్పుడు ప్రారంభించారు?
అక్టోబర్ 2, 1980
34. ఐఆర్‌డీపీ పథకాన్ని ఏప్రిల్ 1, 1999న ఏ పథకంలో విలీనం చేశారు?
స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన
35. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గ్రామీణ భూమిలేని వారికి ఉపాధిహామీ పథకం రెండూ ఏ పథకంలో విలీనమయ్యాయి?
జవహర్ రోజ్‌గార్ యోజన (జెఆర్‌వై)
36. డ్వాక్రా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
సెప్టెంబర్ 1982
37. డ్వాక్రాను విశద పరచండి?
గ్రామీణ ప్రాంతాల మహిళలు, బాలల అభివృద్ధి పథకం (డెవలప్‌మెంట్ ఆఫ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్)
38. డ్వాక్రా పథకం 1999లో దేనిలో విలీనమైంది?
స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన
39. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం (సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ది ఎడ్యుకేటేడ్ అన్‌ఎంప్లాయిడ్ యూత్) ఏ పథకంలో విలీనమైంది?
ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై)
40. కౌన్సిల్ ఫర్ అడ్వాన్‌సమెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ
(కాపార్‌ట)ను ఎప్పుడు స్థాపించారు?
సెప్టెంబర్ 1986
41. కాపార్‌టను ఏ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు?
గ్రామీణాభివృద్ధి శాఖ
42. కాపార్‌ట ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
న్యూఢిల్లీ
43. జవహర్ రోజ్‌గార్ యోజన (జేఆర్‌వై)ను ఎప్పుడు ప్రారంభించారు?
ఏప్రిల్ 1, 1989
44. జేఆర్‌వై ముఖ్య ఉద్దేశం?
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం.
45. జవహర్ రోజ్‌గార్ యోజన ఏప్రిల్ 1, 1999న జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనగా రూపాంతరం చెందింది. సెప్టెంబర్ 25,
2001న జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన ఏ పథకంలో విలీనమైంది?
సంపూర్ణ గ్రామీణ్ రోజ్‌గార్ యోజన
46. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పనకు
1989లో ఏర్పాటైన పథకం?
నెహ్రూ రోజ్‌గార్ యోజన
47. నెహ్రూ రోజ్‌గార్ యోజనను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది?
పట్టణాభివృద్ధి శాఖ
48. నెహ్రూ రోజ్‌గార్ యోజనలో అంతర్భాగంగా ఉన్న మూడు ఉప పథకాలు?
స్కీమ్ ఆఫ్ అర్బన్ మైక్రో ఎంటర్ ప్రైజ్ (ఎస్‌యూఎంఇ)
స్కీమ్ ఆఫ్ అర్బన్ వేజ్ ఎంప్లాయిమెంట్ (ఎస్‌యూడబ్ల్యుఇ)
స్కీమ్ ఆఫ్ హౌజింగ్ అండ్ షెల్టర్ అప్‌గ్రెడేషన్ (ఎస్‌హెచ్‌ఎఎస్‌యు)
49. నెహ్రూ రోజ్‌గార్ యోజనను 1997లో ఏ పథకంలో విలీనం చేశారు?
స్వర్ణజయంతి షహరీ రోజ్‌గార్ యోజన (ఎస్‌జెఎస్‌ఆర్‌వై)
50. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ)ని ఎప్పుడు స్థాపించారు?
1993
51. గ్రామీణ స్త్రీలలో పొదుపును ప్రోత్సహించడానికి అక్టోబర్ 2, 1993న ప్రారంభించిన పథకం?
మహిళా సమృద్ధి యోజన (ఎంఎస్‌వై)
52. జూలై 12, 2001న మహిళా సమృద్ధి యోజనను ఏ పథకంలో విలీనం చేశారు?
మహిళా స్వయం సిద్ధ యోజన
53. గ్రామాల్లో పేదరికాన్ని తగ్గించడానికి స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్‌జీఎస్‌వై) పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఏప్రిల్ 1, 1999
54. స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజనలో విలీనమైన పథకాలు?
ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఐఆర్‌డీపీ)
ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్
ఎంప్లాయిమెంట్ (ట్రైజమ్)
డెవలప్‌మెంట్ ఆఫ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ (డ్వాక్రా)
సప్లై ఆఫ్ ఇంప్రూవ్‌డ టూల్‌కిట్స్ టు
రూరల్ ఆర్టిసాన్‌స (ఎస్‌ఐటిఆర్‌ఏ)
గంగా కల్యాణ్ యోజన (జీకెవై)
మిలియన్ వెల్స్ స్కీమ్ (ఎండబ్ల్యుఎస్)
55. ఎస్‌జీఎస్‌వై ముఖ్య ఉద్ధేశం?
గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం
56. ఎస్‌జీఎస్‌వైలో సహాయం పొందిన ప్రతి కుటుంబం దారిద్య్రరేఖను ఎన్నేళ్లలో అధిగమించేలా చేస్తారు?
మూడేళ్లు
57. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన పథకానికి కావాల్సిన నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో సమకూరుస్తాయి?
75:25