గామీణ అంశాలు | villiage elements | Sakshi
Sakshi News home page

గామీణ అంశాలు

Published Fri, Jan 3 2014 10:52 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఎన్. విజయేందర్ రెడ్డి - Sakshi

ఎన్. విజయేందర్ రెడ్డి

 కేంద్ర ప్రభుత్వ పథకాలు ( 2013)
 నగదు బదిలీ పథకం: కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2013న ‘నగదు బదిలీ పథకం (డెరైక్ట్ క్యాష్ బెనిఫిట్స్ ట్రాన్‌‌సఫర్ స్కీమ్)ను’ 20 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అవుతుంది. ఎల్‌పీజీ, కిరోసిన్ సబ్సిడీలు, పింఛన్లు, స్కాలర్‌షిప్పులు, ఉపాధిహామీ పథకం ద్వారా లభించే కూలీ, ఆధార్ అనుసంధానిత బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుంది. అవినీతికి తావులేకుండా మధ్య, దళారీల జోక్యం లేకుండా నేరుగా లబ్ధిదారులకు నగదు చేరడమే ఈ పథక ప్రధాన ఉద్దేశం.
 ఇలాంటి పథకాలే విదేశాల్లో అమల్లో ఉన్నాయి. బ్రెజిల్‌లో బోల్సా ఫ్యామిలియా, మెక్సికోలో ఆపర్చునిడేడెస్, శ్రీలంకలో సమృద్ధి కోశ్ మొదలైనవి ఇలాంటి నగదు బదిలీ పథకాలే.
 ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని జనవరి 6, 2013న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్‌లు తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ప్రారంభించారు.
 రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం: బాలల కోసం నిర్దేశించిన ఈ ఆరోగ్య పథకాన్ని మహారాష్ర్టలోని థానే జిల్లా పాల్‌గార్ పట్టణంలో ఫిబ్రవరి 6, 2013న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)లో ఈ పథకం ఒక భాగం. 18 ఏళ్ల లోపు వయసు కలిగిన పిల్లలకు ఆరోగ్య సేవలందించడం ఈ పథక ముఖ్య ఉద్దేశం. పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులను త్వరగా నిర్ధారించి తద్వారా శిశుమరణాలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకం ద్వారా దేశంలోని 27 కోట్ల మంది బాలబాలికలు సహాయం పొందనున్నారు. నవజాత శిశు మరణాల్లో పుట్టుకతో వచ్చే లోపాలు 9.6 శాతం వరకు కారణమవుతున్నాయి. ఈ పథకాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.
 ఇందిరా ఆవాస్ యోజన: ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం లక్ష్యం గ్రామీణ పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వడం. దీన్ని జనవరి 1, 1996 నుంచి స్వతంత్ర పథకంగా అమలు చేస్తున్నారు.
 మే 13, 2013న భారత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం మైదాన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని రూ. 45,000 నుంచి రూ. 70,000కు పెంచారు. అదేవిధంగా కొండ ప్రాంతాల్లోని ఇంటి నిర్మాణ ఖర్చును రూ. 48,500 నుంచి రూ. 75,000కు పెంచారు. భూమిలేని వారికి భూమి కొనడానికి ప్రస్తుతం ఇస్తున్న సహాయాన్ని కూడా రూ. 10,000 నుంచి రూ. 20,000కు పెంచారు.
 పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ఐఏవై కింద నిర్మించిన ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వుండటం తప్పనిసరి చేసింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకారం.. ఇందిరా ఆవాస్ యోజన ఇళ్లలో ప్రస్తుతం 21 శాతం మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి.
 ఈ పథకానికి 2012-13 బడ్జెట్‌లో కేవలం రూ. 11,075 కోట్లు కేటాయించగా, 2013-14 బడ్జెట్‌లో రూ. 15,184 కోట్లు కేటాయించారు.
 జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్‌యుహెచ్‌ఎం): పట్టణ ప్రజలకు ఆరోగ్య సేవలందించడానికి కేంద్ర ప్రభుత్వం మే 1, 2013న జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్‌ను ప్రారంభించింది. 50,000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న 779 నగరాలు, పట్టణాలకు ఈ పథకం వర్తిస్తుంది. పట్టణ మురికి వాడల్లో నివసించే పేదవారికి ఆరోగ్య సేవలందించడం ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల కాలానికి ఈ పథకానికి అయ్యే ఖర్చు రూ. 22,507 కోట్లు. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.16,955 కోట్లు భరిస్తుంది. ఈ మిషన్ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు మాత్రం కేవలం 10 శాతం నిధులే సమకూరుస్తాయి. కేంద్రం 90 శాతం భరిస్తుంది.
 ఈ పథకం ప్రకారం 50 నుంచి 60 వేల జనాభాకు ఒక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెలకొల్పాల్సి ఉంటుంది. 200 నుంచి 500 గృహాలకు ఒక ‘ఆశా’ కార్యకర్త (అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) ఉండాలి.
 శిశు మరణాలు, ప్రసూతి మరణాల రేటును తగ్గించే దిశగా జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ను ఏర్పాటు చేశారు.
 
 ట్రైబల్ ఫారెస్ట్ డ్వెల్లర్‌‌స ఎంపవర్‌మెంట్ స్కీమ్: ఈ పథకాన్ని మే 8, 2013న గిరిజన వ్యవహారాలు(ట్రైబల్ అఫైర్స్), పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రారంభించింది. అడవుల్లో నివసించే షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి, సాధికారత కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు.
 రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై): ఏప్రిల్ 1, 2008 నుంచి కార్మిక, ఉపాధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అవ్యవస్థీకృత రంగంలోని బీపీఎల్ కుటుంబానికి ఏటా రూ. 30,000 స్మార్‌‌టకార్‌‌డ ఆధారిత నగదు రహిత ఆరోగ్యబీమాను ఈ పథకం కల్పిస్తుంది. ప్రతి కుటుంబం రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 కట్టాల్సి ఉంటుంది. బీమా ప్రీమియాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వాటా 90:10 ప్రాతిపదికన ఉంటుంది.
 టాక్సీ డ్రైవర్లు, రిక్షా కార్మికులు, గనుల్లో పని చేసేవారు, పారిశుధ్య కార్మికులకు కూడా ఈ పథకాన్ని విస్తరిస్తూ జూన్ 2013లో కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని తీసుకుంది.
 రోష్ని: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జూన్ 7, 2013న 24 అత్యంత  నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించింది. జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లోని చెరి ఆరు జిల్లాలు, చత్తీస్‌ఘడ్‌లో ఐదు , బీహార్‌లో రెండు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ర్టలలో ఒక్కోజిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 50,000 మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు.
 గిరిజన యువతీ యువకులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు దీనికి అర్హులు. ఈ పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో నిధులను సమకూరుస్తాయి. లబ్ధిదారుల్లో 50 శాతం మంది మహిళలు ఉంటారు. ఈ పథకాన్ని మూడేళ్ల పాటు అమలు చేస్తారు.
 రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్: ఉన్నత విద్యారంగాన్ని సమూలంగా మార్చివేసే ఉద్దేశంతో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (ఆర్‌యుఎస్‌ఏ) పథకానికి అక్టోబర్ 3, 2013న ఆర్థిక విషయాలపై కేబినెట్ కమిటీ (సీసీఇఏ) ఆమోద ముద్రవేసింది.
 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017) కాలంలో ఈ పథకానికి రూ. 22,855 కోట్లను కేటాయించారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 16,227 కోట్లు. కేంద్ర, రాష్ట్రాల వాటా 65:35 నిష్పత్తిలో ఉంటుంది. అయితే ఈ పథకంలో ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు కేవలం 10 శాతం నిధులనే సమకూరుస్తాయి. 90 శాతం వాటా కేంద్రం భరిస్తుంది.
 12వ ప్రణాళికలో 80 విశ్వవిద్యాలయాలు, వంద కొత్త కళాశాలలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న 54 కళాశాలలను ఆదర్శ డిగ్రీ కళాశాలలుగా మారుస్తారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు, ప్రయోగశాలలు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు.
 గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి ప్రాంతీయ అసమానతలను తొలగించడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడం, అత్యుత్తమ అధ్యాపకులను నియమించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు.
 జాతీయ ఆహార భద్రతా పథకం: సెప్టెంబర్ 12, 2013న భారత రాష్ర్టపతి ఈ పథకానికి ఆమోద ముద్ర వేయడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 20, 2013న ఢిల్లీలో ఈ పథకాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. దీన్ని ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆహార భద్రతా పథకంగా పేర్కొనవచ్చు.
 ఈ పథకం ద్వారా దేశంలోని 67 శాతం ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు చవక ధరకు లభిస్తాయి.
 దేశ జనాభాలో 2/3వ వంతు ప్రజలకు ప్రతి నెలా ఐదు కిలోల ఆహార ధాన్యాలను అతి తక్కువ ధరకు సరఫరా చేస్తారు. కిలో బియ్యానికి రూ. 3, కిలో గోధుమలకు రూ. 2, కోర్‌‌స ధాన్యాలకు రూ. 1 చొప్పున చెల్లించాల్సి  ఉంటుంది. ఈ పథకానికి ప్రభుత్వం 2013-14కుగాను రూ. 1,24,502 కోట్లు వెచ్చించనుంది. 62 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ప్రతి ఏటా సరఫరా చేయనుంది. ఈ ఆహార ధాన్యాలను లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తారు. రేషన్‌కార్డులను ఇంటిలోని మహిళ పేరు మీదనే ఇస్తారు.
 అహింసా సందేశ పథకం: మహిళలు, బాలలపై హింసను అరికట్టడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆగస్టు 31, 2013న ‘అహింసా సందేశ’ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించారు.
 ఈ పథకాన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ రాజ్ సంస్థలు, సబల పథక సభ్యులైన బాలికల ద్వారా అమలు చేస్తారు.
 దేశంలోని అన్ని ప్రాంతాల్లో అహింసా సందేశకులను నియమించి మహిళా సమస్యలపై ప్రజలను చైతన్య పరుస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement