ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫ్యాకల్టీలు
పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - కల్యాణి.. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్: 2 (విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఐటీ); అసిస్టెంట్ ప్రొఫెసర్: 05 (విభాగాలు: ఫిజిక్స్ - 01, మ్యాథమెటిక్స్ - 01, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఐటీ - 03). దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 16. వివరాలకు www.iiitkalyani.edu.in చూడొచ్చు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ పోస్టులు
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రొఫెసర్; కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్; కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలో లీగల్ అసిస్టెంట్; నౌకాయాన శాఖలో నాటికల్ సర్వేయర్; యానిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు., ప్రొఫెసర్ (ఎకనామిక్స్-1), అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జరీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-19), అసిస్టెంట్ (లెజిస్లేటివ్ కౌన్సిల్-1), నాటికల్ సర్వేయర్ (15), వెటర్నరీ ఆఫీసర్ (2). రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 15. మరిన్ని వివరాలకు www.upsconline.nic.in చూడొచ్చు.
రైట్స్‌లో జూనియర్ అసిస్టెంట్లు
రైల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీసెస్ లిమిటెడ్ (రైట్స్).. జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. జూనియర్ అసిస్టెంట్ (14). 55 శాతం మార్కులతో బీకామ్/బీబీఏ (ఫైనాన్స్)/బీఏఎంఎస్ (ఫైనాన్స్) ఉత్తీర్ణులు అర్హులు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 15. వివరాలకు www.rites.com చూడొచ్చు.
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఆఫీస్ అసిస్టెంట్స్
కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్.. 108 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఐబీపీఎస్ 2014 సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించిన రీజినల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ) పరీక్ష-3లో అర్హత సాధించినవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తెలుగు మాట్లాడి, రాయగలిగి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు http://apgb.in/index.php చూడొచ్చు.
ఎన్‌డీఏలో వివిధ పోస్టులు
ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు.. కెమికల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, డ్రాఫ్ట్స్‌మెన్, కంపోజిటర్ కమ్ ప్రింటర్, కుక్, కార్పెంటర్, సివిలియన్ మోటార్ డ్రైవర్, ఫైర్‌మెన్, టెక్నికల్ అటెండెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 10. అర్హతలు, మరిన్ని వివరాలకు http://ndacivrect.org/eligibility.htm చూడొచ్చు.
ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ
ఎయిర్ ఇండియా.. 331 క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఢిల్లీ (నార్తరన్ రీజియన్ - 217), ముంబై (వెస్ట్రన్ రీజియన్-69), కోల్‌కతా (ఈస్ట్రన్ రీజియన్-08), చెన్నై (సదరన్ రీజియన్-37). 10+2 ఉత్తీర్ణులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 6. వివరాలకు www.airindia.in చూడొచ్చు.
ఆయిల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
ఆయిల్ ఇండియా లిమిటెడ్.. గేట్-2016 ద్వారా ఇంజనీరింగ్ (ఎగ్జిక్యూటివ్ ట్రైనీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విభాగాలు.. మెకానికల్, జియాలజీ, జియోఫిజిక్స్. ఎంపికైనవారికి మొదటి ఏడాది శిక్షణలో స్టైపెండ్‌తోపాటు వసతి సౌకర్యం ఉంటుంది. ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ (మెకానికల్ ఇంజనీరింగ్/జియాలజీ/ జియోఫిజిక్స్)లో 60/65 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. వివరాలకు www.oil-india.com చూడొచ్చు.
ఐజీఐఎంఎస్‌లో వివిధ పోస్టులు
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఐజీఎంఎస్).. సిస్టర్ గ్రేడ్-2 (ఖాళీలు-80), ప్రొఫెసర్ (ఖాళీలు-05), అసిస్టెంట్ ప్రొఫెసర్(ఖాళీలు-13) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సిస్టర్ పోస్టులకు మెట్రిక్యులేషన్/జనరల్ నర్సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు సంబంధిత సబ్జెక్ట్‌ల్లో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులు అర్హులు. నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను ‘ద డెరైక్టర్, ఐజీఐఎంఎస్, షేఖ్‌పూరా, పట్నా-14’కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 28. వివరాలకు www.igims.org చూడొచ్చు.
సీసీఆర్‌ఎస్‌లో పోస్టులు
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్‌చ ఇన్ సిద్ధా (సీసీఆర్‌ఎస్).. రీసెర్‌చ ఆఫీసర్ (ఖాళీలు-27) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మెడిసిన్‌లో పీజీ ఉత్తీర్ణులు అర్హులు. నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను‘ ద డిపార్‌టమెంట్ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్‌సీఆర్‌ఐ బిల్డింగ్, అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంపస్, ఆరుంబక్కం, చెన్నై-600106’కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 9. వివరాలకు www.siddhacouncil.com చూడొచ్చు.
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో గ్రాడ్యుయేట్ ట్రైనీలు
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. గేట్-2016 ద్వారా గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విభాగాలు.. మెకా నికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, మైనింగ్. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది జనవరి 22. గేట్ దరఖాస్తులకు ఆఖరు తేది అక్టోబర్ 1. వివరాలకు www.nlcindia.com చూడొచ్చు.
హెచ్‌పీసీఎల్‌లో ఇంజనీర్లు
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్).. గేట్ 2016 ద్వారా ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విభాగాలు.. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్. గేట్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. హెచ్‌పీసీఎల్ దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 2. వివరాలకు www.hindustanpetroleum.com చూడొచ్చు.
ఎడ్యుకేషన్ & జాబ్స్
Published Fri, Sep 25 2015 12:12 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement